Shani Gochar: కర్మ ప్రధాత , న్యాయాధిపతి అయిన శని ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ఈ రోజు సాయంత్రం అంటే 28 ఏప్రిల్ 2025న ప్రవేశిస్తాడు. శని ఉత్తరాభాద్రపద రాశిని పరిపాలిస్తాడు. శని నక్షత్రంలో మార్పు 12 రాశులపైనా ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. కానీ శని కొన్ని ప్రత్యేక రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉంది. శని రాశి మార్పు వల్ల మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఉద్యోగం, వృత్తి పరంగా విజయం, అదృష్టాన్ని పొందుతారు. ఇంతకీ శని రాశి మార్పు వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శని ఉత్తరాభాద్రపద రాశిలోకి ప్రవేశించడంతో.. వృషభ రాశి వారిపై అత్యంత శుభ , సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. జ్యోతిష్యశాస్త్ర గణనల ప్రకారం.. శని మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో అంటే ఆదాయం, లాభం యొక్క ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. మీ ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. లాభ అవకాశాలు పెరుగుతాయి. మీరు శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో ఆనందం , శ్రేయస్సు పెరుగుతుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి శని మార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా ఏప్రిల్ 28 నుండి మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో, అంటే అదృష్ట గృహంలో శని సంచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు మీ అదృష్టం పెరుగుతుంది. అంతే కాకుండా పనిలో విజయం, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఫలితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతే కాకుండా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మీరు మీ గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు లభిస్తాయి. అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు.
Also Read: శుక్రుడి రాశి మార్పు.. వీరికి ఇప్పటి నుండి అన్నీ సమస్యలే
తులా రాశి:
శని తులా రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో.. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా శని మీ రాశి నుండి మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో.. మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టులో ఏదైనా చట్టపరమైన విషయం జరుగుతుంటే మీరు దానిలో విజయం సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉాన్నాయి. మీరు అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాబోయే సమయం చాలా బాగుంటుంది. మీరు వాహనం, కొత్త ఆస్తులను కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.