Shukra Gochar 2025: ఏప్రిల్ 26, 2025న సంపద, వైభవం, విలాసం, అందాన్ని సూచించే గ్రహం అయిన శుక్రుడు తన గమనాన్ని మార్చుకున్నాడు. ఏప్రిల్ 26న శుక్రుడు.. శని గ్రహం యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. కొన్ని రాశుల వారికి శుక్రుడి రాశి మార్పు సమస్యలను కలిగిస్తుంది. ఈ నక్షత్రరాశి మార్పు కారణంగా.. మరి కొన్ని రాశుల వ్యక్తులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. శుక్రుడి రాశి మార్పు వల్ల ఏ రాశుల వారు ప్రతికూలంగా ప్రభావితమవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశి వారికి.. శుక్రుడి రాశి మార్పు కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది. డబ్బు విషయాలలో సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నవారికి సమస్యలు పెరగుతాయి. ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్రేమ విషయాలలో మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. సంబంధాలలో దూరం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ విభేదాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహ రాశి:
శుక్రుడి రాశి మార్పు కారణంగా సింహ రాశి వ్యక్తులు మానసిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పనిలో సమస్యలు కలుగుతాయి. మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు మీ పనిలో నిరంతర వైఫల్యాలను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి రావచ్చు. ముఖ్యమైన విషయాల పట్ల నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఆఫీసుల్లో సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన సమయం ఇది.
Also Read: తులసి చెట్టుకు ఈ దారం కడితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం, డబ్బుకు ఏ లోటూ ఉండదు
కుంభ రాశి:
శుక్రుడి రాశి మార్పు కుంభ రాశి వారికి అంత మంచిది కాదు. కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ధన నష్టం , గౌరవం తగ్గుతుంది. విద్యార్థులకు చదువుకోవాలని అనిపించదు. మనస్సు విచారంగా , కలత చెందుతూ ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆర్థిక పరంగా చాలా నష్టపోతారు. కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు పెరుగుతాయి. అంతే కాకుండా పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.