BigTV English

AC Side Effects: ఏసీలో ఉంటే కీళ్ల నొప్పులు వస్తున్నాయా? దాని వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి

AC Side Effects: ఏసీలో ఉంటే కీళ్ల నొప్పులు వస్తున్నాయా? దాని వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి

AC Side Effects: వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎయిర్ కండీషనర్ (ఏసీ)లను వాడతారు. ఇంట్లో, ఆఫీసులో, షాపింగ్ మాల్స్‌లో ఏసీలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే, ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు. నిజంగా ఏసీలో ఎక్కువ సమయం పాటు ఉండడం వల్లే కీళ్ల నొప్పులు వస్తాయా? లేదా దీనికి కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఏసీలో చాలా సేపు ఉండడం వల్ల కొందరికి నిజంగానే కీళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయని అంటున్నారు.

కండరాలపై ప్రభావం
ఏసీలు గదిలోని గాలిని చల్లబరుస్తాయి. ఈ చల్లని గాలి కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోయేలా చేస్తుందట. కండరాలు బిగుసుకుపోవడం వల్ల కీళ్లలో ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా, ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాపు సమస్యలు ఉన్నవారికి ఈ సమస్య తీవ్రంగా ఉంటుందట. చల్లని వాతావరణం కీళ్లలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల నొప్పి మరింత పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


కీళ్లపై ఎఫెక్ట్
ఏసీలు గాలిలోని తేమను తగ్గిస్తాయి. దీనివల్ల గదిలో గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి శరీరంలోని తేమను కూడా తగ్గిస్తుందట. ముఖ్యంగా కీళ్లలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోంతుంది. ఈ ఫ్లూయిడ్ కీళ్లను సులభంగా కదిలేలా చేస్తుందట. కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గడం వల్ల కీళ్లు గట్టిపడి, నొప్పి కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

కదలకుండా ఉంటే
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరం ఒకే స్థితిలో ఉంటుంది. కొందరు ఆఫీసులో గంటల తరబడి కూర్చొని పని చేస్తూ, ఏసీలో ఉంటే కీళ్లు కదలకుండా ఉంటాయి. ఇది కీళ్ల గట్టిదనాన్ని, నొప్పిని పెంచుతుందట. కదలిక లేకపోవడం వల్ల రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దీని వల్ల నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబతున్నారు.

ఏసీలో బ్యాక్టీరియా
ఏసీ వల్ల గదుల్లో గాలి నాణ్యత తగ్గుతుందట. ఏసీ ఫిల్టర్లు సరిగా శుభ్రం చేయకపోతే, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి గాలిలో కలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో వాపును పెంచి, కీళ్ల నొప్పులను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యం.

ఈ సమస్యలను తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏసీలో ఎక్కువ సేపు గడపాల్సి వస్తే నీళ్లు ఎక్కువగా తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో తేమ ఉంటుంది. చెడు బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకు ఏసీ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఏసీలో ఉంటే నిప్పులు మరింత ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి డాక్టర్లను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×