Puja: హిందూ మతంలో దేవుళ్లు, దేవతల ఆరాధనకు సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. హిందూ గ్రంథాలలో.. దేవతల ఆరాధనకు సంబంధించిన ఆచారాలు చాలా వివరించబడ్డాయి. అనేక సంప్రదాయాలు కూడా శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. పూజలు లేదా శుభకార్యాల సమయంలో మనం ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది కూడా ఈ సంప్రదాయాలలో ఒకటి. పూజ సమయంలో మనం ధరించే దుస్తులు, పూజా సమయం, శుభ ముహూర్తం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.
వీటి పట్ల జాగ్రత్తలు పాటించకపోతే.. దేవుడి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని అంతే కాకుండా ఆశించిన ఫలితాలు సాధించబడవని నమ్ముతారు. అందుకే పూజ సమయంలో.. నియమాలపై మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం ధరించే బట్టల రంగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హిందూ గ్రంథాల ప్రకారం.. పూజ సమయంలో మనం ఏ రకమైన దుస్తులు ధరించాలి. ఏ రంగు దుస్తులు ధరించకూడదనే విషయాలను గురించి ప్రస్తావించడం జరిగింది.
ఈ రంగుల దుస్తులు ధరించకూడదు:
నలుపు రంగు:
పూజ సమయంలో నలుపు రంగును అత్యంత అశుభకరమైనదిగా భావిస్తారు. హిందూ గ్రంథాలలో నల్లని దుస్తులు ధరించడం నిషేధించబడింది. పూజ సమయంలో.. ఈ రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. కానీ.. శని దేవుడిని పూజించే సమయంలో నల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం. అందుకే శని దేవుడిని పూజించే సమయంలో మీరు నల్లటి దుస్తులు ధరించవచ్చు.
నీలం రంగు:
పూజ సమయంలో నీలిరంగు దుస్తులు ధరించడం నిషేధించబడింది. నీలం రంగు అంత శుభప్రదంగా పరిగణించబడదు. ఈ కారణంగానే ఈ రంగు దుస్తులు పూజ సమయంలో లేదా ఏదైనా శుభ కార్యాల సమయంలో ధరించకూడదని చెబుతారు. అంతే కాకుండా ఈ రంగు అశుభమని నమ్ముతారు.
తెలుపు రంగు:
సాధారణంగా తెలుపు రంగును శుభప్రదంగా భావిస్తారు. దీనిని శాంతికి చిహ్నంగా కూడా చెబుతారు. కానీ హిందూ మతంలో తెల్లని దుస్తులు ధరించడం నిషిద్ధం. తెల్లని దుస్తులు ధరించి..ఏదైనా పూజ లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనడం అశుభంగా పరిగణించబడుతుంది. కాబట్టి.. తెల్లని దుస్తులు ధరించి ఏ పూజలోనూ పాల్గొనకూడదు.
Also Read: త్రిగ్రాహి యోగం, మార్చి 29 నుండి.. వీరు పట్టిందల్లా బంగారం
ఖాకీ రంగు:
ఖాకీ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావు. అందుకే ఖాకీ రంగు దుస్తులు ధరించడం నిషేధించబడింది. దీంతో పాటు.. మురికిగా ఉన్న, చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదు. ఇది కూడా అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే హిందూ మతంలో పూజలు , శుభ కార్యాలు పవిత్రమైన పనులుగా పరిగణించబడతాయి. అందుకే ఈ సమయంలో మనం శుభ్రమైన, చక్కని దుస్తులు మాత్రమే ధరించాలి.