తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రజలు బస్సులలో రాకపోకలు కొనసాగిస్తారు. ఇతర ప్రైవేట్ వాహనాలతో పోల్చితే తక్కువ ధరలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆర్టీసీ పలు ఫ్రీ సర్వీసులు అందిస్తుంది. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ అవేంటి? ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
040-69440000 నెంబర్ తో క్రేజీ సర్వీసులు
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 040-69440000 అనే టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెంబర ద్వారా పలు సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. ముందు మీరు ఈ నెంబర్ ను సేవ్ చేసుకోండి. దీని ద్వారా కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం..
⦿ బ్యాలెన్స్ పైసలు మర్చిపోతే?
సాధారణంగా బస్సులో టికెట్ కొనుగోలు చేసిన సమయంలో నెద్దనోట్లు ఇచ్చినప్పుడు.. చిల్లర లేదని.. ఇవ్వాల్సిన డబ్బులను టికెట్ వెనుక రాస్తారు. కొన్నిసార్లు ప్రయాణీలు మర్చిపోయి అలాగే దిగుతారు. కాసేపటి తర్వాత గుర్తుకు వస్తుంది. అప్పటికే బస్సు వెళ్లిపోతుంది. ఆ సమయంలో 040-69440000 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాలి. అప్పుడు మీకు డబ్బులు ఫోన్ పే చేస్తారు.
⦿ బస్సు మిస్ అయితే?
సాధారణంగా బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు.. బస్సు ఆయా బస్ స్టేషన్లలో ఆగుతుంది. పలువురు ప్రయాణీకులు కిందికి దిగి వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్ లేదంటే ఇతర తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ మీరు కిందికి దిగగానే బస్సు వెళ్లిపోతే వెంటనే 040-69440000 నెంబర్ కు కాల్ చేసి చెప్పాలి. అదే రూట్ లో వచ్చే మరో బస్సులో ఉచితంగా వెళ్లే అవకాశాన్ని కల్పిస్తారు. అదీ.. మీ దగ్గర ఉన్న బస్సు టికెట్ తోనే వెళ్లొచ్చు.
Read Also: ఇండియన్ రైల్వేకు 500వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్, సరుకు రవాణాలో ఇక దూకుడే!
⦿బస్సులో లగేజీ మర్చిపోతే?
బస్సు ప్రయాణం చేసే సమయంలో కొంతమంది ప్రయాణీకులు తరచుగా లగేజీ మర్చిపోతుంటారు. కొన్నిసార్లు అందులోవిలువైన వస్తువులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు కూడా బస్సులో లగేజీ మర్చిపోతే, వెంటనే మీరు 040-69440000 నెంబర్ కు కాల్ చేసి అసలు విషయం చెప్పాలి. వెంటనే ఆర్టీసీ సిబ్బంది మీ లగేజీని తీసి.. మీకు పంపించే ప్రయత్నం చేస్తారు.
సో, ఎంతో ఉపయోగరకరమైన ఆర్టీసీ సేవలు అందించే 040-69440000 లోల్ ఫ్రీ నెంబర్ గురించి మీ ఫ్రెండ్స్ తో పాటు ఇతరులకు చెప్పండి. ఒకవేళ వాళ్లకు పై మూడు సందర్భాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మర్చిపోయిన డబ్బులను తిరిగి పొందడం, బస్సు మిస్ అయితే మరో బస్సులో ఉచితంగా వెళ్లడం, లగేజీ మర్చిపోతే తిరిగి పొందడం లాంటి సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.
Read Also: భారతీయ రైల్వేలో మరో కలికితురాయి, పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
Read Also: షాకింగ్.. మీ వాహనం ఎంత పాతది? ఇకపై మీకు పెట్రోల్ పొయ్యరు!