Shukra Gochar 2025: జూన్ 29 న మధ్యాహ్నం 2:08 గంటలకు, శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచరిస్తాడు. వేద జ్యోతిష్య
శాస్త్రంలో, శుక్రుడిని భౌతిక సుఖాలు, విలాసాలు, ప్రేమ, సంపదకు కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు తన సొంత రాశిలోకి వచ్చినప్పుడు.. దాని ప్రభావం మరింత శక్తివంతమవుతుంది. ఈ సంచారం 12 రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. కానీ ఈ సమయం 5 రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.
శుక్రుడు ప్రతి 23 నుంచి 27 రోజులకు రాశి మార్పు చెందినప్పటికీ ఈసారి శుక్రుడి సంచారం అనేక రాశులకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. జూలైలో ఏ 5 రాశుల వారు గొప్ప ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శుక్రుడు లగ్నరాశిలోకి ప్రవేశించడంతో..వృషభ రాశి వారి ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. అంతే కాకుండా సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రజలతో వారి సంబంధాలు మరింత మధురంగా మారతాయి. వివాహితుల సంబంధాలు బలపడతాయి. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత అధికారులు నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం అంతే కాకుండా విద్యార్థులు కూడా శుభ వార్తలు అందుకుంటారు.
సింహ రాశి:
శుక్రుడు సింహ రాశి కర్మభావనలో సంచరిస్తున్నాడు. ఈ సమయం మీ వృత్తి జీవితానికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు , ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలకు అవకాశం ఉంది. అలాగే.. కుటుంబ మద్దతు కారణంగా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా మీ ఆర్థిక విషయాల పట్ల కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
కన్య రాశి:
ఈ సంచారం కన్య రాశి వారికి భాగ్య స్థానములో జరుగుతోంది. విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య లేదా పెండింగ్ పనులు పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. ఇల్లు లేదా ఆస్తి కొనాలనే ప్రణాళికలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. అంతే కాకుండా కెరీర్‌లో కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం.
Also Read: ఈ రాశులపై సూర్యుడి అనుగ్రహం.. మీది కూడా ఈ రాశేనా ?
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. వ్యాపారాలతో సంబంధం ఉన్న వారికి దేశ, విదేశాలలో విస్తరణ అవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్ర, మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
మీన రాశి:
ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థిక పరంగా మీకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి కెరీర్‌లో కూడా పురోగతి సంకేతాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. తండ్రితో సంబంధం బలంగా ఉంటుంది.