BigTV English

AP : రూ.25 వేల కోట్లు.. తిరుపతి సిటీకి సీఎం గుడ్ న్యూస్

AP : రూ.25 వేల కోట్లు.. తిరుపతి సిటీకి సీఎం గుడ్ న్యూస్

AP : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగు పెట్టారు. ఇది ఇండియన్స్ అందరికీ గర్వకారణం. అంతరిక్షంలో మరోసారి భారతీయ ఘనత చాటిన సందర్భం. ఇలాంటి శుభతరుణంలో.. ఏపీ సీఎం చంద్రబాబు స్పేస్ పాలసీకి శ్రీకారం చుట్టడం ఆసక్తికరం. రూ.25 వేల కోట్ల పెట్టుబడులే లక్షంగా ఏపీ స్పేస్ పాలసీ 4.0 రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పించేలా కార్యచరణ రెడీ అవుతోంది. తిరుపతి, లేపాక్షిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాసంస్థలు, విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు.


లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీస్

ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ టెక్నాలజీల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో ఏపీలో లేపాక్షి, తిరుపతిలో రెండు స్పేస్ సిటీలు నిర్మించేలా అడుగులు పడుతున్నాయి. 500 ఎకరాల్లో లేపాక్షిలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుందది. ఇందులో డిజైన్ అండ్ డెవలప్మెంట్‌కు ప్రాధానత్య ఇస్తారు. ఆర్ అండ్ డి, స్పేస్ స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు-సేవలకు సంబంధించి సంస్థలు ఏర్పాటు కానున్నాయి. తిరుపతి స్పేస్ సిటీని మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థలకు కేటాయించారు. లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్-పేలోడ్ అసెంబ్లీ, మెకానికల్ సిస్టమ్-కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబ్లీ సంస్థలకు తిరుపతి స్పేస్ సిటీలో అవకాశం కల్పిస్తారు. బెంగళూరుకు సమీపంలో లేపాక్షి స్పేస్ సిటీ, శ్రీహరికోట-చెన్నైకు సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండేలా ఎంపిక చేశారు. తిరుపతి స్పేస్ సిటీ నుంచి శ్రీహరికోటకు రోడ్ కనెక్టవిటీ కల్పించనున్నారు.


ఫ్యూచర్ అంతా స్పేస్ టెక్నాలజీదే..

సీఎం జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేశారు. స్పేస్ విజన్ పాలసీ-2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని.. స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని.. భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని సోమనాథ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఇన్వెస్టర్లకు బంపరాఫర్స్

స్పేస్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భారీగా రాయితీలు ఇచ్చేలా పాలసీ రెడీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వివిధ కేటగిరీలకు గాను 25 నుంచి 45శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇచ్చేలా ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. గ్లోబల్ స్పేస్ ఎకానమీలో కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం.. “ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0” రెడీ చేస్తోంది.

Related News

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Big Stories

×