BigTV English

Kannappa Ott Release: కన్నప్ప ఓటీటీ రిలీజ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Kannappa Ott Release: కన్నప్ప ఓటీటీ రిలీజ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Kannappa Ott Release: మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప(Kannappa) అనే మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం గత కొంతకాలంగా మంచు విష్ణు ఎంతో కష్టపడుతూ సినిమా బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు రిపోర్టర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో
ఓపికగా సమాధానం చెబుతూ వచ్చారు.


ఇటీవల కాలంలో సినిమా విడుదల తేదీలు అన్నీ కూడా ఓటీటీ సంస్థల చేతిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఓటీటీ డీల్ కుదిరిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పిన విధంగానే సినిమాని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇటీవల పలువురు నిర్మాతలు తెలియజేశారు. అయితే మంచి విష్ణు కన్నప్ప సినిమా ఓటీటీ విడుదల(Ott Release) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు మంచి విష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు. తనకు సినిమా విడుదల విషయంలో ఎలాంటి ప్రెజర్ లేదని తెలిపారు. తన సినిమాకు ఓటీటీ డీల్ లేకపోవడంతో చాలా ప్రశాంతంగా తన సినిమాను విడుదల చేసుకోగలుగుతున్నానని తెలిపారు.

10 వారాలకే ఓటీటీలో విడుదల…


నాకు సినిమా విడుదల విషయంలో ఎలాంటి ప్రెజర్ లేదని, నా ప్రెజర్ మొత్తం సినిమాని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, అందరిని థియేటర్లకు రప్పించడమేనని తెలిపారు. అదేవిధంగా నా సినిమా థియేటర్లో విడుదలైన 10 వారాల వరకు
ఓటీటీలోకి రావడానికి వీలు లేదు అంటూ మంచు విష్ణు ఈ సందర్భంగా ఓటీటీ విడుదల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. జూన్ 27వ తేదీ ఈ సినిమా థియేటర్లో విడుదల అయితే తిరిగి పది వారాలకు ఓటీటీలోకి రాబోతుందని స్పష్టమవుతుంది. విష్ణు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉండవచ్చు.

అంచనాలు పెంచిన ప్రభాస్…

ఇలా తన సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ విష్ణు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై చాలా మంచి అంచనాలను పెంచేసాయి. ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న మంచు విష్ణుకు కన్నప్ప సినిమా ఏ విధమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది? ఈ సినిమా ద్వారా తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) నటించిన సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ దాదాపు అరగంట పాటు స్క్రీన్ పై సందడి చేయబోతున్నారని విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: BIG TV Kissik talk: డబ్బు కోసమే వాడితో పెళ్లి… తప్పు చేశానా? శుభశ్రీ షాకింగ్ కామెంట్స్

Related News

OTT Movie : ఆకాశంలో తేలే ఈ ఓడలో ఒళ్ళు తెలియకుండా ఆ పనులు… మస్త్ మసాలా స్టఫ్… ఈ మూవీని చూస్తే నిద్ర పట్టడం కష్టమే

OTT Movie : భర్త ఉండగా డబ్బులిచ్చి మరీ మరొకడితో… ఇది మామూలు యవ్వారం కాదు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సిరీస్

OTT Movie : కాకులు దూరని కారడవిలో ఇల్లు… థ్రిల్లింగ్ ట్విస్టులు… అవార్డు విన్నింగ్ సైకో థ్రిల్లర్

OTT Movie : స్టార్ హీరో కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు… ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్… ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?

OTT Movie : పోలీస్ స్టేషన్ ముందే తల లేని శవం… ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Kingdom OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ కింగ్డమ్.. ఎప్పుడంటే?

Big Stories

×