Surya Gochar 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్ నెల 2025 లో చాలా ప్రత్యేకమైంది. ఈ నెలలో.. సూర్యుడు, బుధుడు , బృహస్పతి కలిసి మిథునరాశిలోకి ప్రవేశించి శక్తివంతమైన త్రిగ్రహి యోగాన్ని ఏర్పరుస్తారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన యాదృచ్చిక కలయిక జరగబోతోంది. ఇది అనేక రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతుంది.
త్రిగ్రహి యోగం అంటే ఏమిటి ?
జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం.. ఏదైనా ఒక రాశిలో 3 ముఖ్యమైన గ్రహాలు ఉంటే.. దానిని త్రిగ్రహి యోగం అంటారు. ఈసారి ఈ యోగం జూన్ 15, 2025 న ఏరపడనుంది. ఈ రోజున సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించి, అక్కడ ఇప్పటికే ఉన్న బుధుడు, బృహస్పతితో కలుస్తాడు. ఫలితంగా ఈ 3 రాజయోగాలు శక్తివంతమైన సానుకూల శక్తిని అందిస్తాయి. దీని కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో పెద్ద మార్పులు వస్తాయి. అంతే కాకుండా 4 రాశుల వారికి ధనయోగం కలుగుతుంది. మరి త్రిగ్రాహి యోగం కలయిక ఏ రాశుల వారికి ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కలయిక వలన ఏర్పడే మూడు ప్రధాన యోగాలు:
గురు ఆదిత్య యోగం – సూర్యుడు, గురుడి కలయిక.
బుధాదిత్య యోగం – సూర్యుడు, బుధుడి కలయిక.
భద్ర యోగం – బుధుడు తన సొంత రాశిలో ఉండటం
4 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి:
మిథున రాశి:
మిథున రాశిలోనే త్రిగ్రహి యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీకు మేధోపరమైన పురోగతి, వృత్తిపరమైన వృద్ధి, కుటుంబ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు విజయం, ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి.
వృషభ రాశి:
మీ సంపద ఇంట్లో ఈ గ్రహాల కలయిక ఆస్తి లాభం ఆర్థిక బలానికి కారకంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీరు మీ కమ్యూనికేషన్ కళతో ఇతరులను ఆకట్టుకుంటారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఉన్నతాధికారులు కూడా మీ పనికి ప్రశంసలు అందిస్తారు.
కుంభ రాశి:
మీ ఐదవ ఇంట్లో ఏర్పడే ఈ యోగం పిల్లల ఆనందం, విద్య , సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. కెరీర్‌లో చాలా కాలంగా నిలిచిపోయిన పురోగతి ఇప్పుడు ఊపందుకుంటుంది. ఆధ్యాత్మిక పరమైన ఆసక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి. మునుపటి కంటే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. చుండ్రు సమస్యే ఉండదు తెలుసా ?
ధనస్సు రాశి :
మీ ఏడవ ఇంట్లో త్రిగ్రహ ప్రభావం వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్య పని ఫలితాలను ఇస్తుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతే కాకుండా విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. కెరీర్ లో మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. మీరు పెట్టుబడి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.