Sree Vishnu : రోజులు మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతాయి అంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమాల్లో వినడానికి దారుణంగా అనిపించే డైలాగ్స్ ఇప్పుడు సాధారణంగా అయిపోయాయి. కొన్ని పదాలు వినడానికి ఒకప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఇప్పుడు అదే పదాలను చాలా ఈజీగా వాడేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమాల్లో వినిపించే బూతులు చాలామంది యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోతున్నాయి. దీనికి కారణం సోషల్ మీడియా. ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడెక్కడో విలేజెస్ లో మాట్లాడే పచ్చి పచ్చి బూతులు వీడియోలు అన్నీ కూడా కనిపిస్తుంటాయి. వీటన్నిటిని కొంచెం అటు ఇటుగా మార్చి సినిమాల్లో ఇరికిస్తున్నారు కొంతమంది దర్శకులు.
శ్రీ విష్ణు బూతులు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు ఒకడు. వెబ్ డిజైనర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీ విష్ణు ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా శ్రీ విష్ణు కెరియర్ కి మంచి ప్లస్ అయింది. ఇకపోతే శ్రీ విష్ణు ప్రస్తుతం సోలో హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో శ్రీ విష్ణు సినిమాలోని ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. జనం మధ్య నుంచి వెళ్లిన హీరో కాబట్టి సాధారణంగా ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడుకునే బూతులను సినిమాలో విరివిగా వాడుతుంటాడు. అది పెద్ద తప్పు అని కూడా చెప్పలేము, ఎందుకంటే సినిమా పరిశ్రమలో అటువంటి మార్పులు వచ్చేసేయ్. అయితే శ్రీ విష్ణు మాట్లాడిన బూతులు ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. వాటిని డీ కోడ్ చేయాలి. శ్రీ విష్ణు కంటే ముందు ఒక నటుడు ఇలానే మాట్లాడేవారు.
శ్రీ విష్ణుకు ముందు ఆ నటుడే బూతులు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఒకప్పుడు ఆహుతి ప్రసాద్ పేరు కూడా వినిపించేది. ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు. ఆహుతి ప్రసాద్ నటిస్తుంటే చాలామందికి చూడముచ్చటగా అనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త బంగారులోకం వంటి సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో తరుణ్ మరియు జెనీలియా నటించిన శశిరేఖ పరిణయం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలు ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఎక్కువగా లేదు కాబట్టి ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ మీద పెద్దగా ట్రోల్స్ రాలేదు. ఇప్పుడు గమనించినట్లయితే శ్రీ విష్ణు మాదిరిగానే అప్పట్లో బూతులు మాట్లాడే వారు ఆహుతి ప్రసాద్. కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది.
Also Read : Akhanda2 : పవన్ కళ్యాణ్ తో పోటీ కాకుండా ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నారు