E-Paper
Advertisement

Venus Rise: శుక్రుడి ప్రభావంతో జూన్ 30 నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు !

Venus Rise: శుక్రుడి ప్రభావంతో జూన్ 30 నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు !
Advertisement

Venus Rise Effect: శుక్రుడు మరికొద్ది రోజుల్లో అస్తంగత్వం దశ నుంచి ఉదయించబోతున్నాడు. ఫలితంగా మూడు రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. ఆనందం, ప్రేమ, సంపద ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్లాడు. జూన్ 30 నుంచి శుక్రుడు ఉదయిస్తాడు. జూలై 7న శుక్రుడు మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

శుక్రుడు మిథున రాశిలో ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి లాభాలు, మరికొన్ని రాశుల వారు జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు రాశుల వారు శుక్రుడి అనుగ్రహంతో లక్ష్మీ దేవి కటాక్షం పొందుతారు. శుక్రుడు.. రాహువు, కేతువు, కుజుడు వంటి దుష్టగ్రహాలతో కలిసి ఉంటే సవాళ్లు, అడ్డంకులు కూడా తలెత్తుతాయి.
వృషభరాశి:
శుక్రుడు మిథున రాశిలో ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. వీరు ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఏర్పడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆర్థిక ప్రయత్నాలు విజయాలను అందిస్తాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి శుక్రుడు ఉదయించినప్పుడు మేలు జరుగుతుంది. వీరి ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. ఇంట్లో, ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వీరు దైవకార్యాలలో ఎక్కువ సమయం గడుపుతారు.

Advertisement

Also Read: అర్థ నక్షత్రంలోకి సూర్యుడు.. 3 రాశుల వారి జీవితాల్లో పెను మార్పు

తులా రాశి:
శుక్రుడు మిథున రాశిలో ఉదయించడం వల్ల తులా రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోవడంతో పాటు సహోద్యోగుల మద్దతుతో అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. వీరి వ్యక్తిత్వంతో నలుగురునీ ఆకట్టుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభాలు పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×