UGC – Net Exam cancelled: UGC – Net పరీక్ష రద్దయ్యింది. ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ నెట్ – 2024 పరీక్షను రద్దు చేసినట్లు ఎన్టీఏ బుధవారం ప్రకటించింది. పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కేంద్రం వెల్లడించింది. నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు యూజీసీ గుర్తించింది. ఈ మేరకు పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపిస్తామంటూ హామీ ఇచ్చింది.
Also Read: నీట్ వివాదంపై కాంగ్రెస్ ఆగ్రహం.. జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు
అదేవిధంగా నీట్ పేపర్ లీకేజీపై వస్తున్నటువంటి ఆరోపణలపై కూడా కేంద్రం స్పందించింది. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నది. పట్నాలో నీట్ అవకతవకలపై పోలీసుల విచారణ కొనసాగుతున్నదని తెలిపింది. అయితే, ప్రాథమిక ఆధారాల మేరకు నీట్ లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చామంటూ ప్రకటించింది. దీనిపై బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నది.