Mangal Guru Vakri 2025: గ్రహాల రాశి మార్పు 12 రాశులవారిపై ప్రభావాన్ని చూపుతుంది. దేవగురువు బృహస్పతి తిరోగమన దిశలో సంచరించనున్నాడు. వృషభ రశిలో బృహస్పతి సంచారం అన్ని రాశులపై ఉంటుంది. ఇదిలా ఉంటే అంగారకుడి సంచారం కూడా ప్రతీ రాశిపై ఉంటుంది. అంగారకుడి కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అత్యధిక ప్రభావాన్న చూపుతుంది. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కదలిక కొత్త సంవత్సరంలో ఎవరికి అద్భుత ఫలితాలను ఇస్తుందనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దృక్ పంచాంగం ప్రకారం బృహస్పతి అక్టోబర్ 9 వ తేదీన మధ్యాహ్నం 12.33 గంటలకు వృషభ రాశిలోకి మారనున్నాడు. ఫిబ్రవరి 24 వరకు బృహస్పతి ఇదే రాశిలో తిరోగమన దిశలో ఉంటాడుజ ఇదిలా ఉంటే అంగారకుడు డిసెంబర్ 7 న కర్కాటక రాశిలోకి తిరోగమన దిశలో సంచరిస్తుండగా ఫిబ్రవరి 24 వ తేదీన నేరుగా కదలనునకనాడు.మరి ఈ రెండు గ్రహాల శక్తివంతమైన కదలిక కొన్ని రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది.
మేష రాశి:
మేషరాశిలలో బృహస్పతి రెండవ ఇంట్లో సంచరించనున్నాడు. అంతే కాకుండా అంగారకుడు కూడా ఈ రాశిలో నాల్గవ ఇంట్లో తిరోగమన దిశలో ఉండనున్నాడుజ ఈ సమయంలె మీకు సంతోషాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . అంతే కాకుండా కుటుంబ పరంగా మీ సమస్యలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అంతే కాకుండా మీ ప్రత్యర్థులు మీకు నష్టం కలిగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు అనవసర ఖర్చుల పెట్టడం ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీ భాగస్వామితో మీకు కష్టాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. మీ జాతకం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి:
మీ రాశి యొక్క లగ్న గృహంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. దీని ప్రభావం దాదాపు రెండు నెలల పాటు ఉంటుంది. అంతే కాకుండా మీరు 2025 లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగంలో కూడా బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు జరగకపోవడం వల్ల మీ మనస్సు కలత చెందుతుంది. వ్యాపారంలో కొంత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడండి. దీని వల్ల కూడా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.
Also Read: ఉత్పన్న ఏకాదశి రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్
సింహ రాశి:
మీ రాశిలో అంగారకుడితో పాటు బృహస్పతి పన్నెండవ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. అటువంటి పరిస్థితలో మీరు ఆర్థిక పరంగా అనేక సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో కష్టాలే పెరిగే సమయం ఇది.అంతే కాకుండా పని నాణ్యత కూడా మీపై ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగంలో కూడా ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడం గురించి మీరు తొందరపడి నిర్ణయాన్ని తీసుకోకూడదు. వ్యాపారంలో కూడా నష్టాలు పెరుగుతాయి. అదృష్టం లేకపోవడం వల్ల అనవసర ఖర్చులతో కూడా ఇబ్బంది పడతారు. ప్రేమ జీవితానికి సంబంధించి కూడా ఒత్తిడిని ఎదుర్కుంటారు. దీంతో మీ సంబంధాలు కూడా తెగిపోయే పరిస్థితి వస్తుంది. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం అవసరం.బ
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)