White Hair Remove Tips: వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు రావడం సహజం. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈసమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి అనేక కారణాలు కావచ్చు.. కాలుష్యం, దుమ్మూ, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి మొదలైనవి. కొంత మందికి జీన్స్ పరంగా తెల్లజుట్టు వస్తుంది. చాలా మంది తెల్ల జుట్టను నల్లగా మార్చేందుకు అనేక హెయిర్ ఆయిల్స్, హెన్నా, హెయిర్ డై వంటివి ఉపయోగిస్తుంటారు.
ఇవి కెమికల్‌తో తయారు చేసినవి గనుక జుట్టుకు హానికలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే నాచురల్ హెయిర్ కలర్ తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. పైగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్దాలు..
పసుపు కలర్‌లో ఉండే ఆవాలు
అవిసె గింజలు
కరివేపాకు
అలోవెరా జెల్
తయారు చేసుకునే విధానం..
ఒక కప్పు ఆవాలు, పావుటీస్పూన్ అవిసె గింజలు, ఒక కప్పు కరివేపాకులు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిపెట్టి అందులో ఈ పదార్ధాలను వేయాలి. గ్యాస్ మంట సిమ్‌లో పెట్టి బాగా నల్లగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇది కొద్దిరోజులపాటు నిల్వ ఉంటుంది. అంతే సింపుల్ హెయిర్ కలర్ రెడీ అయినట్లే.. ఈ పొడిని చిన్న బౌల్‌లో తీసుకుని అందులో అలోవెరా జెల్ కానీ కొబ్బరి నూనె కాని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి, గంట తర్వాత తలస్నానం చెయ్యండి.
మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఆవాల్లో జుట్టు రంగును మార్చే గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అవిసెగింజలలో ఒమేగా 3 అనేది ఇందులో అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు, తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. ఇక కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరోగ్యానికి ఎంత మంచిదో జుట్టు పెరుగుదలకు కూడా అంతే మంచిది. వీటిలో యాంటీ ఆక్సీడెంట్లు, జింక్, ఐరన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్స్ తెల్ల జుట్టు నివారణకు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ కలర్ ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
Also Read: నడుము వరకు పొడవాటి జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఇలా వాడండి
తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు మరికొన్ని చిట్కాలు ఉన్నాయి..
ముందుగా బంగాళ దుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి రెండు కప్పుల వాటర్ పోయాలి. అందులో బంగాళదుంప తొక్కలను వేసి బాగా మరిగించాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. ఆ నీటిని వడకట్టి చల్లారనివ్వాలి. కొద్ది సేపటి తర్వాత ఆ నీటిలో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా తెల్లజుట్టు అనేది తొలగిపోతుంది.