Utpanna Ekadashi 2024: హిందూ మతంలో ముఖ్యమైన ఏకాదశి ఉపవాసాలలో ఉత్పన్న ఏకాదశి ఒకటి. ఇది మార్గశీర్ష మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది విష్ణువు ఆరాధన, ఏకాదశి వ్రతానికి సంబంధించినది. గ్రంధాలలో దీనిని మొదటి ఏకాదశిగా కూడా వర్ణించారు. ఈసారి నవంబరు 26న ఉత్పన్న ఏకాదశి వ్రతం పాటించనున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే ఆర్థిక పరంగా మేలు జరుగుతుందని నమ్ముతారు.
ఉత్పన్న ఏకాదశి రోజు సాయంత్రం ఒక్క పరిహారం చేస్తే చాలు.. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారట. అంతే కాకుండా ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలతో జీవితం సంతోషంగా మారుతుంది. ఉత్పన్న ఏకాదశి రోజు సాయంత్రం కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్పన్న ఏకాదశి తేదీ:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఉత్పన్న ఏకాదశి ఉపవాసం మార్గశీర్ష కృష్ణ ఏకాదశి రోజున ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఈ తేదీ నవంబర్ 26 ఉదయం 01:01 నుండి మరుసటి రోజు అంటే నవంబర్ 27 తెల్లవారుజామున 03:47 వరకు ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు.
1. ఆర్థిక సంక్షోభం లేదా అప్పుల నుండి ఉపశమనం పొందడానికి:
ఉత్పన్న ఏకాదశి రోజు సాయంత్రం పూజ గది లేదా స్థలంలో ఎరుపు రంగు క్లాత్ వేయండి. దానిపై ఆసనం మీద కూర్చొని, జపమాలతో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి. హల్వాను విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. తులసి దగ్గర కూడా దీపం వెలిగించండి.
2. రోగాల విముక్తికి పరిహారం:
ఈ రోజు సాయంత్రం, పచ్చి పాలు , నీటిని రావి చెట్టుకు సమర్పించండి. ఈ పరిహారాన్ని ఉత్పన్న ఏకాదశి నుంచి 21 రోజుల పాటు నిరంతరం చేయండి. 21 రోజుల తర్వాత రావి చెట్టు మొదలు నుంచి నుండి కొద్దిగా తడి మట్టిని తీసుకుని, నుదిటి , నాభికి రుద్దుకోండి. భగవంతుడు శ్రీ హరిని ఆరాధించడానికి ఇది పవిత్రమైన రోజు.
3. ముందస్తు వివాహానికి గొప్ప పరిహారం:
ఉత్పన్న ఏకాదశి రోజున ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. శాలిగ్రామ స్నానం చేసి చందనం పెట్టుకోండి. పసుపు రంగు క్లాత్ పై వివాహం జరగాలనుకుని వారిని కూర్చోబెట్టి కూర్చోబెట్టండి. వారికి మీ స్వంత చేతులతో తులసిని సమర్పించండి. దీని తర్వాత వివాహం త్వరగా జరగాలని ప్రార్థించండి.
Also Read: ఉత్పన్న ఏకాదశి రోజు ఇలా చేస్తే.. అన్ని పాపాలు తొలగిపోతాయ్
ఉత్పన్న ఏకాదశి రోజు శ్రీ హరి యొక్క ఈ మంత్రాలను జపించండి:
1. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్
2. ఓం విష్ణవే నమః
3. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
4. శ్రీ కృష్ణ గోవింద్ హరే మురారే, ఓ నాథ్ నారాయణ్ వాసుదేవాయ
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)