BigTV English

BB Telugu 8: తారుమారైన లెక్కలు.. కన్నడ బ్యాచ్ నుండి ఇద్దరు అవుట్..!

BB Telugu 8: తారుమారైన లెక్కలు.. కన్నడ బ్యాచ్ నుండి ఇద్దరు అవుట్..!

BB Telugu 8: బిగ్ బాస్ 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. నవంబర్ 22 ఎపిసోడ్ లో హౌస్ కి కొత్త మెగా చీఫ్ గా జబర్దస్త్ రోహిణి (Jabardast Rohini)గెలిచి, తన స్ట్రాటజీ చూపించింది. ఇక దీంతో బిగ్ బాస్ సీజన్ 8 చివరి మెగా చీఫ్ గా కూడా నిలిచింది రోహిణి. ఇదిలా ఉండగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంది అనే సమాచారం తాజాగా అందింది. ఈ మేరకు ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే గత 11 వారాలుగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్న కన్నడ బ్యాచ్, ఈ వారంలో ఏకంగా ఇద్దరు హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లు తెలిసింది.


తారుమారైన ఓటింగ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం హౌస్ లో గౌతమ్ కృష్ణ, నబీల్, నిఖిల్ మలియక్కల్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ కంబం, జబర్దస్త్ ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, నబీల్ ఆఫ్రిది, యష్మీ గౌడ ఇలా మొత్తం పదిమంది టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ 12వ వారం నామినేషన్ లో ఏకంగా 5 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నిలిచారు. 12వ వారం నామినేషన్స్ లో భాగంగా నిఖిల్, ప్రేరణ, పృథ్వీ , నబీల్, యష్మీ ఇలా మొత్తం ఐదు మంది నామినేషన్ లో నిలిచారు. ముఖ్యంగా వీరందరినీ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన ఎక్స్ హౌస్ మేట్స్ నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ తర్వాత నుంచి వీరందరికీ ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది.


బెస్ట్ ఫ్రెండ్స్ ఔట్..

ఇక ఓటింగ్ పోల్ మొదలైన రెండు మూడు రోజుల్లోనే ప్రేరణ మొదటి స్థానంలో ఉండగా.. యష్మీ రెండవ స్థానం, నబీల్ మూడవ స్థానం, నిఖిల్ నాల్గవ స్థానం, పృథ్వీ 5వ స్థానంలో నిలిచారు. ఇక డేంజర్ జోన్ లో పృథ్వీ నిలవడం జరిగింది. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనడంతో టైటిల్ విన్నర్ అనుకుంటున్నా నిఖిల్ కూడా ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా బిగ్ బాస్ ఓటింగ్ స్థానాలు కాస్త మారిపోయాయి. ఫైనల్ గా శుక్రవారం నవంబర్ 22 తో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యాయి. ఇక ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్న ప్రేరణ స్థానాన్ని ఆక్రమించేశారు నిఖిల్. ఓట్ పర్సంటేజ్ పెంచుకొని మొదటి స్థానంలోకి వచ్చేసారు. ఆ తర్వాత రెండో స్థానంలో నబీల్ నిలిచాడు. మూడవ స్థానంలో ప్రేరణ నిలవగా నాలుగవ స్థానంలో యష్మీ గౌడ ఐదవ స్థానంలో పృథ్వీ నిలిచారు. ఇకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గానే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా పేరు తెచ్చుకున్న యష్మీ గౌడ, పృథ్వీ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. ఎలాగో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈరోజు ఎపిసోడ్లో పృథ్వీ , రేపటి ఎపిసోడ్ లో యష్మీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×