Kashi Varanasi: ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్బుతమైన అధ్యాత్మిక ప్రపంచమే కాశి. ఇదే వారణాశిగా ఇప్పుడు పిలుస్తున్నాం. హిందూ గ్రంథాల ప్రకారం ఈ భూమ్మీద మొట్టమొదటి పట్టణం కాశీ. అదే విధంగా చిట్ట చివరి పట్టణం కూడా కాశీయే అంటారు. అలాంటి కాశీకి ఎప్పుడైనా వెళ్తే ఏదొ మొక్కుబడిగా దేవుడి దర్శనం చేసుకుని రావడమే కాదు.. అక్కడి అద్బుతమైన ఆధ్యాత్మికమైన ప్రపంచంతో కనెక్ట్ అవ్వండి. అవును కాశీలోని ఆధ్యాత్మిక ప్రపంచం చూడాలనుకుంటే ఒక్క జన్మ సరిపోదంటారు పెద్దలు. అలాంటి మహోన్నతమైన కాశీ అద్బుతాలు గురించి కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువు కాశీ. కాశీ పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రమైన గగా నది ఒడ్డున ఉంది. సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడే నడయాడిన నేల కాశీ. కాలబైరవుడే క్షేత్రపాలకుడిగా ఉన్న పుణ్యక్షేత్రం కాశీ. అటువంటి కాశీ యాత్రను ఒక్కసారైనా చేయాలనుకుంటాడు ప్రతి హిందువు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల అపార నమ్మకం.
కాశీ విశ్వనాథ ఆలయం:
కాశీలో ప్రధాన ఆలయం ఇది. ఇక్కడ శివుడు విశ్వనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వేశ్వర లింగం ఒకటి. ఈ ఆలయ దర్శనం జరిగితే చాలు జీవితం ధన్యమవుతుందని హిందువులు నమ్ముతారు.
అన్నపూర్ణా దేవి ఆలయం:
సాక్ష్యాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడికే ఆహారాన్ని బిక్షగా వేసిన అమ్మవారు అన్నపూర్ణాదేవి. కాశీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం అన్నపూర్ణాదేవి ఆలయం. ఈ ఆలయం కాశీ విశ్వనాథ్ మందిరానికి వాయవ్య దిశలో ఉంటుంది. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణమ్మను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు.
కాశీ విశాలాక్షి ఆలయం:
ప్రపంచంలోని 51 శక్తి పీఠాలలో కాశీ విశాలాక్షి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో సతీదేవి కుడి చెవి ఇక్కడ పడింది. అందుకే ఇక్కడి అమ్మవారికి విశాలాక్షి పేరు వచ్చిందంటారు. నవరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
కాలభైరవుడి ఆలయం:
కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఆయన ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది. ఇప్పటి కాలబైరవుడు కాశీ క్షేత్రాన్ని కాపాడుతున్నాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కాలబైరవుడు నిత్యం పూజలందుకుంటారు. కాశీ వెళ్లిన భక్తులు ముందు కాలబైరవుడిని దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది.
గంగా హారతి:
కాశీలో అందరి ఆకలి అన్నపూర్ణాదేవి తీరిస్తే.. భక్తుల దాహాన్ని గంగమ్మ తీరుస్తుంది. ఆలాంటి గంగమ్మకు ప్రతిరోజు మూడు పూటలా గంగా హారతి జరగుతుంది. అయితే భక్తులు ఎక్కువగా సాయంత్రం జరిగే హారతిని చూసేందుకు వస్తుంటారు.
ఇవే కాకుండా ఇంకా మృత్యుంజయేశ్వరాలయం, సారనాథ్ మందిరం, వ్యాస కాశి, దండపాణి మందిరం, చింతామణి గణపతి మందిరం, బిర్లా టెంపుల్, సంకట విమోచన హనుమాన్ మందిరం, శ్రీ త్రిదేవి మందిరం, దుర్గా మాత ఆలయం, తులసి మానస మందిరం, గవ్వలమ్మ ఆలయం, కేదారేశ్వర ఆలయం, తిలబండేశ్వరాలయం, జంగన్ వాడి మఠం, బిందు మాధవుడు గుడి, వారాహిదేవి ఆలయం, దత్త పీఠము ఇలా కాశీలో ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు కాశీలోని చిన్న చిన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాశీలో మొత్తం 20వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. అలాగే ఎన్నో వేల మఠాలు ఉన్నాయి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు