Singer Moushmi Neha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్లే బ్యాక్ సింగర్లు(Play Back Singers) మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ప్లే బ్యాక్ సింగర్లుగా ఎంతోమంది కొత్తవారు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు సింగర్లు కేవలం సినిమా పాటలు మాత్రమే పాడుతూ ఉండేవారు కానీ, ప్రస్తుతం మాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసుకుంటూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో మౌస్మి నేహా(Moushmi Neha) ఒకరు.
సింగర్ ప్రవస్తి వివాదాస్పద వ్యాఖ్యలు…
ప్రస్తుతం మౌస్మి నేహా ఇండస్ట్రీలో అద్భుతమైన పాటలను పాడుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈమె కూడా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమా అవకాశాలను అందుకున్నారు.. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌస్మి నేహా తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇలాంటి తరుణంలోనే ఇటీవల సింగర్ ప్రవస్తి(Pravasthi) పాడుతా తీయగా(Paadutha Theeyaga) కార్యక్రమం గురించి చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
షో రేటింగ్ ముఖ్యం…
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మౌస్మీ నేహాకు సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. పాడుతా తీయగా కార్యక్రమం బాలు గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం ఈ షోలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారని, రేటింగ్ కోసం ఎక్స్ ఫోజ్ చేయాలి, ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జడ్జెస్ వద్దని చెబుతారు అంటూ ఈ షో గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మౌస్మి నేహకు ప్రశ్నలకు ఎదురు కావడంతో ఆమె కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఒకప్పుడు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు చాలా బాగుండేవి కానీ ఇప్పుడు షో రేటింగ్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిపారు. ఒక షోలో నాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ మాలిక్ గారు, వేటూరి గారు జడ్జిలుగా ఉండేవారు. ఫస్ట్ సాంగ్ నేనే పాడాల్సి ఉంది. అదొక మాస్ సాంగ్ కావడంతో రెండు లైన్లు పాడగానే వేటూరి గారు ఈ సాంగ్ వద్దని చెప్పారు. మొత్తం ఏడు మంది పార్టిసిపేట్ చేయగా ఆరుగురు పాడిన తర్వాత నేను ఏడవ కంటెస్టెంట్ గా వెళ్లాను. అప్పటికప్పుడు ఏ పాట సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు, పైగా చూడకుండా పాడాలి లిరిక్స్ కరెక్ట్ గా వస్తాయా లేదా అన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఇక నేను ఆ కొంత సమయంలోనే సై సినిమాలో కళ్యాణ్ మాలిక్ గారు పాడిన పాటను వేదికపై పాడాను. అదృష్టం ఏంటంటే నేను లిరిక్స్ ఎక్కడ తప్పు లేకుండా పాడటంతో నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయని తెలిపారు. ఇలా సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ నిజమేనని మౌస్మి నేహా చెప్పకనే చెప్పేశారు.