Sandeep Kishan:’మజాకా’ సినిమాతో రీసెంట్ గా మన ముందుకు వచ్చి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ కిషన్ (Sandeep Kishan) తాజాగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్న విషయంపై అఫీషియల్ గా బయట పెట్టేశారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? నిజంగానే సందీప్ కిషన్ ప్రేమలో పడ్డారా? అనేది ఇప్పుడు చూద్దాం.. సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నది అమ్మాయితో అనడం కంటే హీరోయిన్ అనగానే అందరూ గుర్తుపట్టేస్తారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కసాండ్రా (Regina Cassandra). అవును.. చాలా రోజుల నుండి రెజీనా , సందీప్ కిషన్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందరూ షాక్ అయిపోయే విషయాన్ని బయటపెట్టారు సందీప్ కిషన్.ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెజీనాతో ఉన్న బంధాన్ని అఫీషియల్ గా చెప్పేశారు.. రెజీనాతో ఉన్న బంధం గురించి సందీప్ కిషన్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
రెజీనాతో రిలేషన్ పై స్పందించిన సందీప్ కిషన్..
రెజీనా, సందీప్ కిషన్ కాంబినేషన్లో రొటీన్ ‘లవ్ స్టోరీ’, ‘నక్షత్రం’, ‘రారా కృష్ణయ్య’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు చేసినప్పటి నుండి రెజీనా,సందీప్ కిషన్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే రెజీనాకి సందీప్ కిషన్ తో మాత్రమే కాకుండా సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) తో కూడా ఈ ప్రేమ వార్తలు వినిపించాయి.సాయి ధరమ్ తేజ్ రెజీనా కాంబినేషన్లో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలు వచ్చాయి. దాంతో రెజీనా మెగా మేనల్లుడికి భార్య కాబోతుందని ఎన్నో వార్తలు వినిపించాయి. అలా అటు సందీప్ కిషన్ ఇటు సాయి ధరంతేజ్ లకి రెజీనాతో లవ్ అని వార్తలు వచ్చినప్పటికీ ఏది నిజమో ఏది రూమరో తెలియడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనాతో ఉన్న బంధంపై అఫీషియల్ గా బయట పెట్టారు సందీప్ కిషన్.
ALSO READ ; Tamannaah Bhatia: హవ్వ.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా? వీడియో చూస్తే షాకే!
ప్రేమా లేదు.. గీమా లేదు.. అంతా ఉత్తిదే -సందీప్ కిషన్
ఆయన మాట్లాడుతూ.. నాకు రెజీనాకు మధ్య ఎలాంటి చెడు రిలేషన్ లేదు.మా ఇద్దరి మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.ఇక మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే ఫోన్ చేసుకొని గంటలు గంటలు మాట్లాడుకోం. కానీ మేము కొట్టుకున్నంతలా ఎవరూ కొట్టుకోరు.టామ్ అండ్ జెర్రీలా ఉంటాం. ఇక రెజీనా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్.నేను ఇల్లు కొనుక్కున్న సమయంలో నాకు 5 లక్షల రూపాయలు అవసరం పడిందని ఆమెనే తెలుసుకొని మరీ నాకు అప్పు ఇచ్చింది.. అంత మంచి రిలేషన్ ఉంది మా మధ్యలో.కానీ చాలామంది మా మధ్య వేరే రిలేషన్ ఉందని, మేమిద్దరం ప్రేమికులమంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మా మధ్య ప్రేమ అనే వర్డ్ లేదు.కేవలం స్నేహితులం మాత్రమే అంటూ రెజీనాతో బంధం పై ఓపెన్ గా చెప్పేసారు సందీప్ కిషన్.ఇక సందీప్ కిషన్ క్లారిటీ ఇవ్వడంతో కొంతమందేమో ఫ్రెండ్స్ అనుకుంటే మరికొంత మందేమో చాలామంది హీరోలు హీరోయిన్లతో రిలేషన్ల గురించి ఇలాగే ఫ్రెండ్స్ అని చెప్పి తప్పించుకుంటారు.కానీ పెళ్లి చేసుకునే వరకు తెలియదు వాళ్ళు లవర్స్ అని కామెంట్లు పెడుతున్నారు.