BigTV English

Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా డే.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కార్యక్రమం..

Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా డే..  ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో కార్యక్రమం..


Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యోగాసనాలు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా దినోత్సవంలో పాల్గొంటారు.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గంటపాటు యోగా కార్యక్రమం జరుగుతుంది . ఐక్యరాజ్య సమితి అత్యున్నత అధికారులు, పలు దేశాల రాయబారులు, ప్రముఖులు యోగ ఆసనాలు వేయనున్నారు. జూన్‌ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.


భారత్‌ బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గాంధీకి ప్రధాని మోదీ నివాళులర్పించిన తర్వాత యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది.180 దేశాలకు చెందిన ప్రతినిధులు యోగా దినోత్సవంలో పాల్గొంటారు.

పలు దేశాల రాయబారులు, కళాకారులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మోదీతో కలిసి యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 77వ సెషన్‌ అధ్యక్షుడు సాబా కొరొసి ట్వీట్ చేశారు.

Related News

Cough Syrup Deaths: దగ్గు మందు తాగిన ఆరుగురు చిన్నారులు మృతి.. ఈ సిరప్ లు బ్యాన్.. దర్యాప్తు చేపట్టిన కేంద్రం

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం

UP News: 75 ఏళ్ల వయస్సులో పెళ్లి.. ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతి రోజే ప్రాణాలు విడిచిన వరుడు

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

LPG Cylinder Price: పండగ వేళ సిలిండర్ ధరలకు రెక్కలు.. ఆపై కేంద్రం మరొక శుభవార్త

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Big Stories

×