E-Paper
Advertisement

Lord Narasimha Swamy: అహోబిలంలో ఎవ్వరికీ తెలియని నరసింహ్మ స్వామి రహస్యాలు

Lord Narasimha Swamy: అహోబిలంలో ఎవ్వరికీ తెలియని నరసింహ్మ స్వామి రహస్యాలు
Advertisement

Lord Narasimha Swamy: అహోబిలం నరసింహ్మస్వామి ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలను.. ఆ క్షేత్ర పరిధిలోని  రహస్యాలను అక్కడి స్వామి భక్తులకు దర్శనం ఇస్తున్న రూపాలను ఇంకా ఆ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకతలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

అహోబిలంలోని లక్ష్మీనరసింహ్మస్వామి గురించి చాలా మందికి తెలుసు కానీ అక్కడి నరసింహ్ముడి అవతారాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందరూ అక్కడ నరసింహ్మస్వామి ఒకే అవతారంలో దర్శనం ఇస్తారని అనుకుంటారు. కానీ అక్కడ నవనారసింహులు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఆ నవ నారసింహుల రూపం వెనక దాగి ఉన్న అసలు రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జ్వాలా నరసింహుడు: అహోబిలంలో మొదటగా ఆవిర్భవించిన మూర్తి జ్వాలా నరసింహమూర్తి అని చెప్తుంటారు. ఈయనే ఉగ్ర నరసింహుడి స్వరూపముగా బావిస్తారు. ఈ నరసింహ్మ స్వామి ఎంతో  తేజో స్వరూపము భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. ఈయనే ఇక్కడ హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో కొలువై ఉన్నాడు.

అహోబిల నరసింహ స్వరూపము: ఈ స్వరూపమే ఈ క్షేత్రం పేరుగా అంటే అహోబిలంగా ప్రసిద్ది చెందింది. నరసింహ్మ స్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కోపంగా కూర్చున్నట్లుగా ఈయన దర్శనం ఇస్తాడు. ఈ నరసింహ్మస్వామి పేరు మీదతే ఈ క్షేత్రం పేరు స్థిరపడిపోయిందట.

Advertisement

మాలోల నరసింహుడు: ఈ నరసింహ్మస్వామి ఎంతో ప్రేమగా శాంతంగా దర్శనం ఇస్తుంటాడు. మాలోల నరసింహుడే చెంచులక్ష్మీగా వచ్చిన లక్ష్మీదేవిని పరిణయం చేసుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడట. ఈ స్వామి ఆశీస్సులు ఉంటే వివాహం కాని వారికి కూడా వెంటనే వివాహం అయిపోతుందటని పండితులు చెప్తుంటారు.

కరంజ నారసింహుడు: కరంజ అంటే మరాఠాలో ధ్యానం చేయడం అని అర్థం వస్తుందట. కరంజ నారసింహుడు అంటే చెట్టుకింద ధ్యానముద్రలో ఉన్న నారసింహుడు అంటారు.

పావన నారసింహుడు: పావన నారసింహుడు అంటే జీవితాలను పావనం చేసేవాడు అని అర్థం. ఈ స్వామి దగ్గరకు వెళ్లి ఒక్కసారి మొక్కితే జన్మజన్మల పాపాలు హరిస్తాయని పండితులు చెప్తుంటారు. ఈ స్వామి దయ ఉంటే బిచ్చగాడు అయినా కోటీశ్వరుడు అయిపోతాడని భక్తులు నమ్మకట. మనుషులకు ఎలాంటి భోగభాగ్యాలు కావాలన్నా ఈ పావన నారసింహుడు ఇస్తాడని నమ్ముతారు. అందుకే ఈ స్వామిని పావన నరసింహుడు అని పిలుస్తారట.

యోగ నరసింహుడు: అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టము కట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడట ఈ స్వామి. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు పండితులు చెప్తుంటారు.

చత్రవట నరసింహ స్వరుపము:  పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాప విమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారట. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహ స్వరూపము అంటారు. అక్కడకు వెళ్ళి కొంత మంది పెద్దలు సంగీతము పాడుతుంటారట.

భార్గవ నరసింహుడు:  పరశురాముడు నరసింహస్వామి దర్శనము చెయ్యాలని కోరుకుంటే స్వామి అనుగ్రహించి పరశురాముడికి దర్శనము ఇచ్చిన స్వరూపమట ఇది. అందుకే ఈ స్వామిని భార్గవ నరసింహుడు అని పిలుస్తారట.

వరాహ నరసింహ స్వరూపము:  భూమిని తన దంతాల మీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహ స్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహ స్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గుడిలో తీర్థము తీసుకున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి – ఇంకా గుడిలో ఎలా ఉండాలంటే 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×