BigTV English

Shiva Temple Hawaii : హవాయ్ శివాలయం.. వెరీ స్పెషల్

Shiva Temple Hawaii : హవాయ్ శివాలయం.. వెరీ స్పెషల్
Shiva Temple Hawaii

Shiva Temple Hawaii : హవాయ్ ద్వీపసమూహంలోని ఆ హిందూ ఆలయం ప్రత్యేకతలే వేరు. కవాయ్(Kauai) దీవిలోని ఆ శివాలయం పూర్తిగా గ్రానైట్ నిర్మితం. పచ్చటి పరిసరాల మధ్య తెల్లటి గ్రానైట్,స్వర్ణ గోపురాలతో ఉన్న ఇరైవన్ ఆలయం(Iraivan Temple) ఎంతగానే ఆకట్టుకుంటుంది.


హవాయ్ దీవుల 14 లక్షల జనాభాలో హిందువులు ఒక శాతమే ఉంటారు.కవాయ్ దీవిలో 50 మందికి మించి ఉండరు. కవాయ్ ఆధీనం ఆవరణలోనే పదిమందికిపైగా భిక్షువులు ఉంటారు. 1990లో ఆలయ నిర్మాణం ఆరంభమైంది.

వ్యవస్థాపకుడు సద్గురు శివయ సుబ్రముణియస్వామి 2001లో మరణించిన తర్వాత నిర్మాణం కొనసాగింది. రాతి చెక్కడపు పనిలో విద్యుత్తును, యంత్రాలను వినియోగించనే లేదు. పూర్తిగా మానవశ్రమతోనే ఆలయ నిర్మాణం ముగియడం విశేషం. ఇది పూర్తి కావడానికి 33 ఏళ్ల సమయం పట్టింది.


ఇక ఈ ఆలయంలో విద్యుద్దీపాలు ఉండవు. ఫ్యాన్లు, ఏసీలు కనిపించవు. చమురు దీపాలను మాత్రమే వెలిగిస్తారు.
ఇరైవాన్ ఆలయం చోళుల నిర్మాణశైలిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడి శివలింగం మరీ ప్రత్యేకం.

317.5 కిలోల క్వార్ట్జ్ క్రిస్టల్‌తో శివలింగం తయారైంది. ఇక్కడే కడవుళ్ ఆలయం కూడా ఉంది. ఆలయ నిర్మాణానికి 3600 రాళ్లను ఉపయోగించారు. పిల్లర్లు, బీమ్‌ల కోసం 1600 టన్నుల గ్రానైట్ అవసరమైంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×