BigTV English

Horoscope 16 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆ విషయంలో తొందరపడొద్దు!

Horoscope 16 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆ విషయంలో తొందరపడొద్దు!

Astrology 16 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది> వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. సూర్య ధ్యానం మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కఠినంగా ఉండవచ్చు. ఒక శుభవార్త వింటారు. ఇతరులతో వాదనలు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరంతర సాధనతో మేలు జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో ఉత్సహం తగ్గకుండా చూసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. గో సేవ చేస్తే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆదాయం రెట్టింపు పెరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్త వింటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీలక్ష్మీగణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారులు ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపార భాగస్వాముల పెట్టుబడి విషయంలో తొందరపడొద్దు. ఊహించని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు పుబ్బ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కన్య:
కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు వాదనలు, చర్చలకు దూరంగా ఉండాలి. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది.

Also Read:  ఈ రాశుల వారు కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉంటారు

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చంద్రశ్లోకం చదివితే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. సంతానం, చదువు విషయంలో ఆందోళన చెందుతారు. కీలక విషయాల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేదు. పెండింగ్ సమస్యలు పూర్తిచేసేందుకు శ్రమిస్తారు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం సహకరించదు. గురుచరిత్ర చదవడం మంచిది.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో మిత్రుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభదాయకం.

కుంభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఏ పని మొదలు పెట్టిన సులువుగా పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. గణపతి ప్రార్థనతో మెరుగైన ఫలితాలు ఉంటాయ.

Related News

Vastu Tips: కర్పూరంతో ఈ పరిహారాలు చేస్తే.. ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయం !

Samantha: సమంత పూజిస్తున్న ఈ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ దేవత ఎంత శక్తిమంతురాలంటే ?

Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?

Diwali 2025: దీపావళికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం !

Hasanamba temple: దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఏడాది పాటు ఆరని దీపం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Big Stories

×