EPAPER

Ganesh Nimajjana: ఈ రూట్‌లో వెళ్లారో బుక్ అవుతారు.. నిమజ్జనాల రూట్ మ్యాప్ ఇదే

Ganesh Nimajjana: ఈ రూట్‌లో వెళ్లారో బుక్ అవుతారు.. నిమజ్జనాల రూట్ మ్యాప్ ఇదే

Traffic Restrictions: గణపతి నిమజ్జనం రోజున రోడ్లు కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా విఘ్నేశ్వరుడి విగ్రహాలను తీసుకెళ్లే దారుల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది. అన్నీ సజావుగా, సాఫీగా సాగడానికి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణపతి విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కొన్ని మార్గాలను కేటాయించారు. ఆ దారులకు వాహనదారులు వెళ్లితే బుక్కయిపోవడం ఖాయం. గణనాథుల ఊరేగింపు ఏరియాలను మొత్తం ఏడు జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో ఊరేగింపు జరిగే దారుల్లోకి వెళ్లితే ఇక అంతే సంగతులు. ఆ జోన్లు, ఊరేగింపు జరిగే మార్గాలను తెలుసుకుందాం.


రూట్ మ్యాప్..
ఊరేగింపు ఏరియాలను మొత్తం ఏడు జోన్లుగా విభజించారు. రూట్ వన్‌ను సౌత్ ఈస్ట్ జోన్‌గా, రెండో రూట్‌ను సౌత్ జోన్‌గా, మూడో రూట్‌ను ఈస్ట్ జోన్‌గా, రూట్‌ ఫోర్‌ను సౌత్ వెస్ట్ జోన్‌గా, ఐదో రూట్‌ను వెస్ట్ జోన్‌గా, ఆరో రూట్‌ను నార్త్ జోన్‌గా డివైడ్ చేశారు. ఇక లాస్ట్‌ ఏడో రూట్‌ను సెంట్రల్ జోన్‌గా నిర్ణయించారు. ఈ చివరి రూట్‌లోనే ఖైరతాబాద్ బడా గణేష్ ఊరేగింపు కొనసాగనుంది.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ విగ్రహాలు గుర్రం చెర్వు ట్యాంక్‌, కట్ట మైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్‌లో పరిధిలోకి ప్రవేశిస్తాయి. ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్, ఎడమ మలుపు, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎస్‌ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు వెళతాయి.


సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, రాణిగంజ్, కర్బలా మైదాన్, సోనాబాయి మసీదు, ట్యాంక్ బండ్ గుండా వెళ్తూ ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్‌కు చేరుకుంటాయి. చిలకలగూడ ఎక్స్ రోడ్ల నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ ఫ్లై ఓవర్, నారాయణగూడ వై జంక్షన్, హిమాయత్‌నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయని రూట్ మ్యాప్‌లో వివరించారు.

ఈస్ట్‌జోన్‌ ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చే విగ్రహాలు రామంతాపుర్, శ్రీరమణ జంక్షన్, ఆరో నెంబర్ జంక్షన్, తిలక్‌నగర్, శివం రోడ్, ఉస్మానియా వర్సిటీ ఎన్‌సీసీ, విద్యానగర్ జంక్షన్, హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్, ఫీవర్ హాస్పిటల్, టీవై మండలి, బర్కత్‌పురా ఎక్స్ రోడ్ల మీదుగా వెళతాయి. వైఎమ్‌సీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్ చేరుకుని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌ నుంచి ఊరేగింపులో చేరాలని సూచించారు.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ నుంచి వచ్చే విగ్రహాలు నల్గొండ ఎక్స్ రోడ్‌లో చేరతాయి. భారీ విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపులో కలుస్తాయి.

టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటాయి.

Also Read: Ganesh Nimajjanam: నిమజ్జనం రోజు ఇలా ప్రయాణించండి.. మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు!

ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపులో నిరంకారీ భవన్‌ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వరకు వెళ్తాయి. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి విగ్రహాలు, సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్ ఎక్స్ రోడ్, అఘాపురా, గోషామహల్ బారాదరి, అలాస్కా, మలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజే మార్కెట్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

గణేష్ విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలు కాకుండా ఇతర వాహనాల రాకపోకలకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో ఎంట్రీని నిలిపివేశారు. ప్రధాన మార్గాలు, ఇతర ఉపనది ఊరేగింపుల మార్గాలకు ఆనుకుని ఉన్న అనేక పాయింట్ల వద్ద పరిమితం చేసి దారి మళ్లిస్తారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు.

ట్యాంక్‌బండ్‌ వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాలను పార్క్ చేసి నిమజ్జన ప్రదేశాలను కాలినడకన వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, లోయర్ ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వైపు, ఆదర్శ్‌నగర్ రోడ్, బీఆర్కే భవన్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్, ఖైరతాబాద్‌ జంక్షన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

నిమజ్జనాల కోసం హైదరాబాద్ 10 చోట్ల బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేశారు. జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్టాల్, సంజీవయ్య పార్క్ ఎదురుగా ఉన్న హెర్బల్ స్పైసెస్ గార్డెన్ పక్కన, జల విహార్ పక్కన ఉన్న గ్రీన్ పార్క్ పాయింట్, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, గౌలిపురలోని బతుకమ్మ బావి, వైశాలి నగర్, ఐఎస్ సదన్, శివాలయం రియాసత్‌నగర్, స్వామి దేవాలయం హమామ్ బౌలి, రాజనా బావి, జంగమెట్‌లో బేబీ పాండ్స్‌ ఏర్పాటు చేశారు.

Also Read: iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

సిటీలోని ఎన్టీఆర్ స్టేడియం, రాంలీలా గ్రౌండ్, చింతల్‌బస్తీ, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, చిలకలగూడ, అమీర్‌పేట్ ప్లే గ్రౌండ్, అలీ కేఫ్, అంబర్‌పేట్, ఎస్బీఏ గార్డెన్, హండ్రెడ్ ఫీట్ రోడ్, కుల్సుంపురా, నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వాటర్ ట్యాంకుల ద్వారా నిమజ్జనం చేస్తారు.

గణేష్ నిమజ్జనాల రోజు మార్గదర్శకాలు, ప్రయాణ సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు 040-27852482, 8712660600, 9010203626 లను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పోలీసుల ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Related News

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Big Stories

×