BigTV English

Horoscope libra 2025 :  తులా రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope libra 2025 :  తులా రాశి జాతకులకు 2025లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

Horoscope libra 2025 :   గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. తులా రాశి  జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం తులా రాశి  జాతకులకు ఆదాయం -11, వ్యయం-5గా ఉంది. అంటే పదకొండు రూపాయలు సంపాదిస్తే అయిదు  రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు.   ధన పరంగా సింహ రాశి జాతకులకు ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-2,  అవమానం -2 గా ఉంది. అంటే  ఇద్దరు మీకు గౌరవం ఇస్తే.. ఇద్దరు మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


జనవరి :  తులా రాశి జాతకులు ఈ నెలలో ప్రతి ఒక్కరితోను సున్నితంగా మాట్లాడటం మంచిది. స్థిరాస్తుల అమ్మకాలు వాయిదాలు వేసుకొవడం మంచిది. కుటుంబ సభ్యులు అనుకూలంగా ఉంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. సుఖశాంతులు ఉంటాయి.

ఫిబ్రవరి: తులా రాశి జాతకులు ఈ నెలలో రావలసిన బాకీలు వసూలు చేసుకొవడం మేలు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనుము, సిమ్మెంటు విక్రయదారులకు లాభములు. యువకులు పరస్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి.


మార్చి : తులా రాశి జాతకులకు ఈ నెలలో అధికంగా శ్రమ ఉంటుంది.  యువకులు ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త ఉండాలి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి.  హోటల్స్, వెల్డింగ్ షాపుల వారికి అధిక శ్రమ ఉంటుంది.

ఏప్రిల్ : తులా రాశి జాతకులు ఈ నెలలో  తల పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  శరీరసౌఖ్యం, సుఖం, వస్త్రలాభం, సంతాన విషయంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.

మే : తులా రాశి జాతకులు ఈ నెలలో  తమ మాటలతో అందరినీ జయిస్తారు.  సంతానానికి స్వల్ప అనారోగ్యము కలుగుతుంది.  మిత్రులు, బంధువుల వలన సంతోషము కలుగును. వస్త్ర వ్యాపారులకు ఈ నెల కలిసొస్తుంది.

జూన్ :   తులా రాశి జాతకులు ఈ నెలలో  కుటుంబ సౌఖ్యము, స్త్రీలకు అన్ని విధములుగా లాభదాయకంగా ఉంటుంది. ధనలాభము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు అభివృద్ధి కలుగుతుంది. తండ్రికి అనారోగ్య వచ్చే సూచనలు ఉన్నాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

జూలై : తులా రాశి జాతకులు ఈ నెలలో తలచిన పనులలో విజయం పొందుతారు.    విద్యార్థులు నామమాత్రముగా ఉత్తీర్ణతను సాధించెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ లభించే అవకాశం ఉంది గాయకులకు క్రీడాకారులకు పరీక్షా కాలముగా ఉంటుంది.

ఆగష్టు : తులా రాశి జాతకులు ఈ నెలలో  ఆకస్మిక ప్రయాణముల వలన లాభం జరగుతుంది. బంధుమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. బంగారు ఆభరణము కొనుగోలు చేస్తారు. కంప్యూటర్ రంగం వారికి ఈ నెల అన్ని విధాలుగా బాగుంటుంది.

సెప్టెంబర్ : తులా రాశి జాతకులు ఈ నెలలో   పెండ్లి మొదలగు శుభకార్యములకు పూనుకుంటారు. డాంభికమగు పనులు చేస్తారు. విదేశాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు నామమాత్రముగా ఉత్తీర్ణత సాధించెదరు.

అక్టోబర్ : తులా రాశి జాతకులు ఈ నెలలో   సంయమనముతో వ్యవహరించి అందర్ని గెలుస్తారు. వ్యవహార జయం కలుగుతుంది. వాహనముతో గాని ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి.

నవంబర్: తులా రాశి జాతకులకు ఈ నెలలో  వర్తక మూలకంగా సామాన్య లాభములు గడిస్తారు.  ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. స్థానభ్రంశము వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులు నామమాత్రముగా ఉత్తీర్ణత సాధిస్తారు.

డిసెంబర్ : తులా రాశి జాతకులు ఈ నెలలో  బంగారు నగలు, రత్నములు అమ్ముట వలన అధిక ఆదాయము పొందుతారు.  గాయకులకు ధనలాభము ఉంది.  ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు నామ మాత్రముగా ఉత్తీర్ణత సాధిస్తారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Big Stories

×