Jabardast Sunny:బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్న కామెడీ షో జబర్దస్త్ (Jabardasth)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను నిర్విరామంగా అలరిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. అలా జబర్దస్త్ లోకి వచ్చిన కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా, ఇంకొంతమంది కమెడియన్లుగా కూడా సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ వారి జీవితంలో ఉండే విషాద గాథలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.
ప్రేమించిన అమ్మాయి కోసం జీవితమే త్యాగం..
ఇకపోతే అలాంటి వారిలో సన్నీ (Sunny) కూడా ఒకరు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)టీంలో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న సన్నీ తన కామెడీతో, పంచ్ లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన జీవితంలో విషాదం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఎప్పుడూ తాగుబోతు క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. కానీ అతని లైఫ్ లో ఒక విషాదం ఉందని తెలిసి అందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆస్తిపాస్తులు బాగా ఉన్నా కూడా ఒక అమ్మాయి కోసం లైఫ్ మొత్తాన్ని వదిలేసుకున్నాడు సన్నీ. ఇప్పటికీ కూడా ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ను వృధా చేసుకుంటున్నాడు. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా జబర్దస్త్ ఎపిసోడ్లో చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ, పెళ్లి పై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ కూడా ఒంటరిగానే ఉంటున్నాను అంటూ తెలిపారు సన్నీ.
సన్నీ జీవితంలో ఇంత విషాదం ఉందా..
అసలు విషయంలోకెళితే.. ఇటీవల జబర్దస్త్ ఎపిసోడ్లో యాంకర్ రష్మీ (Anchor Rashmi).. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి.. ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అని కూడా అడిగగా.. దానికి సన్నీ మాట్లాడుతూ.. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. దాదాపు 8 సంవత్సరాలు ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను వదిలేసి ఇంకొకడిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందన్న ఒక కారణంతో ఆమె నన్ను వదిలేసింది” అంటూ తెలిపారు. ఇక మధ్యలో మరో కమెడియన్ రాంప్రసాద్ కలుగజేసుకుంటూ.. సన్నీ మంచి కోటీశ్వరుడు. బోలెడన్ని డబ్బులు కూడా ఉన్నాయి. కానీ లవ్ ఫెయిల్ అవ్వడంతోనే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. సన్నీకి అన్న, వదిన, ఇద్దరు డాటర్స్ కూడా ఉన్నారు. అంత డబ్బున్నా కూడా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు. మా రూమ్స్ కి వచ్చి తాగి పడుకుంటాడు. ఒక అమ్మాయి కోసం వాడు తన జీవితాన్నే వదిలేసుకున్నాడు అంటూ తెలిపారు రామ్ ప్రసాద్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు.. ఇన్ని రోజులు వయసైపోయి తాగుతున్నాడు అనుకున్నాను.. కానీ ఆయన జీవితంలో ఇంత విషాదం ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిజంగా ప్రేమించిన వాళ్లే ఇలా సింగిల్ గా ఉండిపోతారని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.