E-Paper
Advertisement

Horoscope 26 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Horoscope 26 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Astrology 26 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలతో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. అధికారులు మీ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. హనుమాన్ చాలీసా చదవడంతో మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు పొందుతారు. శుభవార్త వింటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి పదింతలు ఆదాయం వస్తుంది. ఇష్టదైవతారాధన శుభకరం.

మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. పెండింగ్ పనుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని రంగాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. కోపం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. శ్రీవిష్ణువుని ఆరాధించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సమయానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కీలక వ్యవహారాల్లో ఒత్తిడి, శ్రమ పెరుగుతుంది. ఆటంకాలు, సమస్యలు ఎదురుకావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు వాయిదా వేసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. యోగా, ధ్యానంతో ఆరోగ్యం. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

Also Read:  ఆగస్టు 25 -31 వరకు, రాశుల వార ఫలాలు

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. అన్ని రంగాల వారు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇతరులతో వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. కోపం, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి. ఊహించని లాభాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శ్రీఆంజనేయస్వామి దండకం చదివితే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. వ‌ృత్తి, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వరిస్తాయి. ఇతరులతో కలిసి పనులను పూర్తిచేస్తారు. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో పట్టిందలా బంగారం అవుతుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఆరోగ్యం, సంపద కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించని విధంగా పదింతలు లాభాలు ఉండవచ్చు. గురు శ్లోకాలు పఠించడం శుభకరం.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. చికాకు, కోపాన్ని ప్రదర్శించవద్దు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పదింతలు లాభాలు వరిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం అవసరం. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులకు ఊహించని ధన ప్రవాహం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×