BigTV English

WI vs SA 2nd T20I: తడబడిన సఫారీ జట్టు, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలుపు.. సిరీస్ కైవసం..

WI vs SA 2nd T20I: తడబడిన సఫారీ జట్టు, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలుపు..  సిరీస్ కైవసం..

WI vs SA 2nd T20I: టీ 20 వరల్డ్‌కప్ తర్వాత సఫారీ జట్టు తేరుకున్నట్లు కనిపించలేదు. విండీస్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కీలకమైన మ్యాచ్‌లో రాణించాల్సిన ఆ జట్టు, కేవలం టాప్ ఆర్డర్ మినహా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేశారు. మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను దక్కించుకుంది విండీస్ జట్టు.


వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు టీ 20 సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 2-0 తేడాతే గెలుచుకుంది. చివరి మ్యాచ్ ఇరు జట్ల మధ్య మంగళవారం జరగనుంది. తరుబా వేదికగా ఈ రెండు జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది.

తొలుత టాస్ గెలిచిన సఫారీ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు.. ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్- హోప్ ఇద్దరు కలిసి జట్టు స్కోరు పెంచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించారు.


ALSO READ: అప్పుడే రిటైర్మెంటా? అదంతా ఫేక్: కేఎల్ రాహుల్

అర్థసెంచరీ చేస్తాడని భావిస్తున్న తరుణంలో అనుకోకుండా హోప్ 41 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద వెనుదిరిగాడు. వెంటనే పూరన్, చేజ్, తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ పావెల్-రూథర్‌ఫోర్డ్ జట్టు స్కోరును పరుగులెత్తించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది విండీస్ జట్టు.

180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు, విండీస్ ఆటగాళ్లను ఏ మాత్రం ప్రతిఘటించ లేకపోయింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్-రియాన్, ట్రిస్టన్ స్టబ్స్ తప్పితే మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ర్యాన్ రికెల్టన్-హెండ్రిక్స్ దూకుడు ప్రదర్శించారు.

వీరిద్దరు 4.4 ఓవర్లకు 63 పరుగులు చేశారు. ఇదే సమయంలో రియాన్.. విండీస్ బౌలర్ జోసెఫ్‌కు దొరికిపోయాడు. కొద్దిసేపటికి మరో ఓపెనర్ హెండ్రిక్స్, కెప్టెన్ మార్క్‌రామ్.. షెపర్డ్ బౌలింగ్‌లో అవుటయ్యా రు. దీంతో విండీస్ జట్టులో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

స్టబ్స్ రాణించినప్పటికీ.. వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్నారు. 30 పరుగుల తేడాతో విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. 19.4 ఓవర్లకు 149 పరుగులకు ఆలౌటయ్యింది.

విండీస్ బౌలర్లలో జోసెఫ్‌, షెపర్డ్‌లు మూడేసి వికెట్లు నేల కూల్చారు. దక్షిణాఫ్రికా బౌలర్ విలియమ్స్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ 28న ఇదే మైదానంలో జరగనుంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×