BigTV English
Advertisement

Weekly Horoscope: ఆగస్టు 25 -31 వరకు, రాశుల వార ఫలాలు

Weekly Horoscope: ఆగస్టు 25 -31 వరకు, రాశుల వార ఫలాలు

Weekly Horoscope : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్, వ్యాపారంలో ఊహించిన దానికంటే తక్కువ విజయాలను సాధిస్తారు. ఈ వారం మీకు విచారంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన మేష రాశి వ్యక్తులు దీర్ఘకాలిక నష్టాలను పొందుతారు. ముఖ్యంగా కొత్త ఒప్పందం చేసుకునే వారు ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


వృషభ రాశి:
ఈ వారం మొదట్లో కాస్త ఒడిదుడుకలను ఎదుర్కొంటారు ఈ సమయంలో చిన్న పనులు పూర్తిచేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది పుష్పరాశి వారు తమ శక్తి సమయం డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి పొదుపుగా ఖర్చు చేయడం మంచిది.

మిథున రాశి:
వారం మొదట్లో మిథున రాశి వారు తమ మాటలను, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం మంచిది. చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకు మంచి రోజులు వచ్చే వరకు వేచి చూడండి. మీరు వ్యాపారం చేస్తుంటే గనక ఈ వారంలో వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. లేకుంటే మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ వారం అంత బాగుండదు. ఆఫీసుల్లో పెద్ద బాధ్యతలు, అకస్మాత్తుగా మీ మీద వచ్చి పడతాయి. ఈ పనులు పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక వ్యాధులను గురవుతుంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది.

సింహ రాశి:
సింహరాశి వారికి ఈ వారం మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఒక సమయంలో జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ముందు ముందు కెరీర్ పరంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. అన్ని రకాలుగా మానసికంగా అలసిపోతారు. అధికారులతో కొంత సమన్వయ లోపం ఎదురవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.

కన్య రాశి:
కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీకున్న పని అనుభవం వల్ల వర్క్ సమయానికి పూర్తి చేస్తారు. ప్రతి అంశంలోనూ సన్నిహితులు బంధువుల నుంచి మద్దతు పొందుతారు. దైర్యం బాగా పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొంటారు.

Also Read: ఈ రోజు నుంచి వీరికి మంచి రోజులు.. లక్ష్మీదేవి అనుగ్రహం

తులా రాశి:
తులా రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పెద్ద పెద్ద కోరికలు కూడా నెరవేరే సమయం ఇది. సోమరితనం విడిచిపెట్టి శ్రద్ధతో పనులు చేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఆఫీసుల్లో కూడా మీ వ్యూహాలను ప్రశంసిస్తారు. సీనియర్ల నుంచి ఆశీస్సులు పొందుతారు. విద్యార్థులకు చదువు పట్ల ఈ సమయంలో ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు. నిలిచిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. అధికారులు, ప్రభుత్వ వ్యక్తులతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×