BigTV English

Horoscope 28 September 2024: ఈ రాశి వారికి ప్రమోషన్ ఛాన్స్.. ఇష్టదైవారాధన శుభకరం!

Horoscope 28 September 2024: ఈ రాశి వారికి ప్రమోషన్ ఛాన్స్.. ఇష్టదైవారాధన శుభకరం!

Astrology 28 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. ఏ రాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. అన్ని రంగాల వారు మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. వృథా ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సకాలంలో పనులు నెరవేరుతాయి. ఉన్నతాధికారుల సహకారంతో లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ అవకాశం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఊహకందని లాభాలు అందుకుంటారు. గతంలో ఉన్న బకాయిలు వసూలవుతాయి. పెండింగ్ పనులు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆపదలు తొలగిపోవడానికి శ్రీరామరక్షాస్తోత్రం చదివితే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు, స్థాన చలనం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంపద వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది.

Also Read: నవంబర్ 10 వరకు శని, రాహువు సంచారంతో అదృష్టవంతులు కాబోతున్నారు

తుల:
ఈ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ అవకాశం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సవాళ్లను ఎదుర్కొంటారు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ప్రారంభించి పనుల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవరించాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం శుభప్రదం.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల ప్రవర్తనతో ఇబ్బంది పడుతారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.

కుంభం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుదల ఉండవచ్చు. షష్ఠమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తున్నారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. జలాశయాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.

Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×