BigTV English

OTT Movie : ప్రపంచాన్నే వణికించిన హార్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : ప్రపంచాన్నే వణికించిన హార్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : ఓటీటీల్లో చాలా జానర్ల సినిమాలు ఉంటాయి. కామెడీ, ఫ్యామిలీ, లవ్ స్టోరీలు ఎక్కువగా వీక్షకులను కనెక్ట్ చేస్తాయి. కానీ థ్రిల్లర్, సస్పెన్స్, హారర్ కంటెంట్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా కొత్త తరహా థ్రిల్‌ని ఇచ్చే హారర్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా హిట్‌ అవుతాయి. అలాగా ఇది ప్రపంచంలోనే బెస్ట్ హారర్ సినిమా అనే ట్యాగ్ ను కొన్ని సినిమాలు మాత్రమే సొంతం చేసుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే.


ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ 

హారర్ అనగానే గుర్తొచ్చేది హాలీవుడ్. ఈ మూవీ కూడా అదే కోవకు చెందింది. కాకపోతే స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. హారర్ మూవీ లవర్స్ కు కావాల్సిన కిక్ ను ఇస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ హర్రర్ సినిమా రూపొందింది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, కాసుల వర్షం కురిపించింది అంటే ఏమిటో ఈ సినిమా చూపించింది. కేవలం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 2,668 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్టు సమాచారం. ఇది 2013లో విడుదలై ఘనవిజయం సాధించిన హారర్‌ చిత్రం కాగా, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన మూడు సీక్వెల్‌లు వచ్చాయి. ప్రస్తుతం టీమ్ నాలుగో సీక్వెల్ చేయడానికి రెడీ అవుతోంది. డిటెక్టివ్‌లు లోరైన్‌, ఎడ్‌ వారెన్‌ల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.


స్టోరీ లోకి వెళ్తే… 

ఈ సినిమాలో ఓ అందమైన కుటుంబం ఉంటుంది. అయితే ఆ ఫ్యామిలీ ఇంటి చుట్టుపక్కల ఉన్న గార్డెన్‌లో ఒక పాత చెట్టు ఉంటుంది. అక్కడే పలు  వింత సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో జరిగిన ఊహించని సంఘటనల తర్వాత ఎడ్, లోరైన్ ఈ కేసును పరిశోధించి, ఆ ఇంటి గురించి భయంకరమైన రహస్యాలను బయట పెడతారు. వినడానికి సింపుల్ గానే ఉన్నా చూస్తే మాత్రం భయంతో చెమటలు పట్టడం ఖాయం.

ప్రపంచంలోనే బెస్ట్ హారర్ మూవీ 

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా కంజ్యూరింగ్ ప్రపంచంలోనే బెస్ట్ హారర్ మూవీగా పేరు తెచ్చుకుంది. మీరు హారర్ సినిమాల ప్రేమికులైతే తప్పకుండా కన్జూరింగ్ సినిమాను చూడాలి. ఇందులో ఉన్న కథ, కథనం, స్క్రీన్‌ప్లే మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అయితే ఇప్పటిదాకా చాలా హారర్ సినిమాలు చూసాం మనం. కానీ వాటిలో అన్నాబెల్లె,  ప్యాలెస్, ఉమెన్ 2, ది కంజురింగ్, ఈవిల్ డెడ్ వంటి ఘోస్ట్ చిత్రాలు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చిత్రాలుగా నిలిచాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మొత్తం మూడు సీక్వెల్స్‌ రూపొందాయి. నాల్గవ చిత్రం ‘ది కంజురింగ్ : ది లాస్ట్ రైట్స్’ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ నాలుగవ  భాగం 2025లో విడుదల కానుంది. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిర్ ఎప్పటిలాగే 4 వ పార్ట్ కూడా భయపెట్టి బెస్ట్ హారర్ మూవీ అన్పించుకుంటుందా అనేది చూడాలి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×