Bigg Boss 9 Promo: బిగ్ బాస్ 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్ మనం సోమవారం రోజు చూసాం. అయితే నామినేట్ అయిన వారు సేవ్ అవ్వడం కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఎంపిక చేసిన దివ్య, రీతు,కళ్యాణ్ ముగ్గురిని బీబీ రాజ్యానికి రాజు మరియు రాణులుగా ఉంటారని చెప్పారు. ఆ తర్వాత దివ్య,రీతు, కళ్యాణ్ ముగ్గురు కలిసి రాజు,రాణి గెటప్స్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక వీళ్ళు ఎంట్రీ ఇవ్వడంతోనే ఇమ్మానుయేల్ రాజ్యంలో ఇంత మంచి రాణులు ఉంటారని నేను ఎప్పుడూ కలగనలేదు అంటూ తన కామెడీని మొదలు పెట్టాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ నలుగురు కమాండర్స్ గా.. నలుగురు ప్రజలుగా..విభజించమని రాజు కు ఇద్దరు రాణులకు ఆర్డర్ వేస్తారు.. ఆ తర్వాత కళ్యాణ్ ఇమ్మానుయేల్ ని లోపలికి పిలుచుకొని మా రాజ్యానికి మిమ్మల్ని కమాండర్ గా పెడితే ఎలా ఉంటుంది..మీరు మా రాజ్యానికి ఏ విధంగా సేవ చేస్తారు అని కళ్యాణ్ అడగడంతోనే..ఇమ్మానుయేల్ చేతులు కట్టుకొని కూర్చొని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. రాజ్యానికి సేవ చేయడంలో రాజ్యాన్ని కాపాడడంలో కొద్దో గొప్పో నా దగ్గర నైపుణ్యం ఉంది. అందుకే రాజ్యంలో ఉన్న ప్రజలందరిని నేను కాపాడగలను అని ఇమ్మానుయేల్ చెబుతుండగానే దివ్య మధ్యలో కలగజేసుకొని మిమ్మల్ని మీరు పది వారాలుగా బాగా కాపాడుకుంటూ వస్తున్నారు అంటూ సెటైర్ వేస్తుంది.
ఆ తర్వాత మరో కమాండర్ గా డిమోన్ పవన్ ని ఎంచుకోని లోపలికి పిలవడంతో లోపలికి ఎంట్రీ ఇచ్చిన డిమోన్ రాణులను కాకాపడుతూ ఉంటారు. నన్ను కమాండర్ గా ఎంచుకుంటే ఇద్దరు రాణులకు ఏం కావాలో అది నేను దగ్గరుండి చూసుకుంటాను అంటూ డిమోన్ రీతు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాంతో అది చూసిన దివ్య మధ్యలో కలుగజేసుకొని నువ్వు అంత దగ్గరికి వెళ్లనక్కర్లేదు అక్కడ నిల్చోండి అని కౌంటర్ ఇస్తుంది. అలా తాజాగా విడుదలైన ప్రోమో నవ్వులు పూయిస్తుంది.
అలా ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకోవడం కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో ఎవరు బయటపడతారు.. ఎవరు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నామినేషన్ నుండి సేవ్ అవుతారు అనేది ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. ఇక ఇప్పటికే 9 వారాల గేమ్ అయిపోయింది. తొమ్మిదో వారంలో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వగా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటికి వెళ్లిపోయారు. అయితే ఈసారి నామినేషన్స్ లో గౌరవ్, నిఖిల్,దివ్య, సంజనా,భరణి లు ఉన్నారు వీరిలో ఎవరు సేవ్ అవుతారో చూడాలి.
also read:Hero Dharmendra: మా నాన్న చనిపోలేదు.. మండిపడ్డ కూతురు!
తాజా ప్రోమో చూసిన తర్వాత దివ్యకి ఆటిట్యూడ్ ఎక్కువైందని చెవులు కొరుక్కుంటున్నారు నేటిజన్స్. ఇకపోతే మధ్యలో మాటిమాటికి కలగజేసుకొని కౌంటర్ వేయడం కొంతమందికి నచ్చకపోయినా.. మరి కొంతమంది గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.