BigTV English
Advertisement

Horoscope 30 August 2024: నేటి రాశి ఫలాలు.. వ్యాపారులకు పండగే..ఊహించని ధనప్రవాహం

Horoscope 30 August 2024: నేటి రాశి ఫలాలు.. వ్యాపారులకు పండగే..ఊహించని ధనప్రవాహం

Astrology 30 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశి వారికి లాభాలు, నష్టాలు వరించే అవకాశం ఉంది. వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మంచి లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారులు సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. కీలక వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో పూర్తిచేస్తారు. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. యోగా, ధ్యానం చేస్తే మంచిది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. విష్ణువుని ఆరాధించాలి.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభవార్త వింటారు. పెద్దల సలహాలతో విజయం పొందుతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇష్ట దేవతారాధన శుభకరం.

Also Read: సోమవతి అమావాస్య ఎప్పుడు ? ఆ రోజు ఏం చేయాలి

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. చేసే పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు. శ్రీలక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

సింహం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. మంచి శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆంజనేయ స్వామి ధ్యానం శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ఆదాయం దరిచేరుతుంది. ఆర్థికంగా వృద్ది ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. ఒత్తిడి, శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తొందరపాటు మంచిది కాదు. నవగ్రహ శ్లోకాలు చదవండి.

Also Read: వ్యతిరేక దశలో బృహస్పతి సంచారం.. 3 రాశుల వారి జీవితాల్లో డబ్బు పొంగిపొర్లుతుంది

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు నష్టం రావొచ్చు. ఉద్యోగులకు ఇబ్బంది పరిస్థితులు ఎదురువుతాయి. ఆందోళనలు, కోపం, చిరాకులతో సతమతమవుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక పనులను మనోబలంతో చేస్తే విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఉండవచ్చు. కీలక సమయాల్లో డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపం, చిరాకులకు దూరంగా ఉండడం మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణతో ఆపదలు తొలగిపోతాయి.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గురు ఆరాధన శుభప్రదం.

Also Read: 2 రోజుల పాటు చతుర్థి తిథి.. గణేష్ స్థాపనకు ఏ సమయం అనుకూలంగా ఉండనుంది ?

మకరం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరే వరకు పోరాడతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆదాయం పదింతలు వస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. చేసే పనుల్లో తిరుగులేని విజయం సాధిస్తారు. ఉద్యోగులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురిచేయవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సమాజంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు పండగే. ధన ప్రవాహం ఉంటుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

 

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×