BigTV English

Barinder Sran: రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత్ క్రికెటర్..టీ20 మ్యాచ్‌లో ఉత్తమ రికార్డు!

Barinder Sran: రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత్ క్రికెటర్..టీ20 మ్యాచ్‌లో ఉత్తమ రికార్డు!

Barinder Sran Announces Retirement From All Forms Of Cricket: టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ బరీందర్ శ్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 31 ఏళ్ల బరీందర్ శ్రాన్..మొదట బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాడు.


భారత్ తరఫున కేవలం ఆరు వన్డేలు ఆడిప శ్రాన్..ఏడు వికెట్లు, రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ధోన్నీ కెప్టెన్సీలో జింబాబ్వేపై తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.

ఇక, ఐపీఎల్ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి ఫ్రాంచైజీల్లో ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2019 ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ జట్టులో శాన్ సభ్యుడిగా ఉన్నాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్ లో 24 మ్యాచ్‌లు ఆడిన శాన్ 9.40 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. శాన్ చివరగా 2019లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 2021లో లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు.


Also Read: ఆరోజు విమానంలో కొహ్లీ, రోహిత్ ఏమన్నారంటే?

ఇదిలా ఉండగా.. బరీందర్ శ్రాన్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. ‘నా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే చాలా మంచిగా ఉంది. ఎన్నో జ్ఞాపకాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన కోచ్‌లకు, మేనేజ్ మెంట్, నాతోటి సహచర క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు. నాపై నమ్మకం ఉంచి ఆడించినందుకు రుణపడి ఉంటా. నేను మరో కొత్త అధ్యాయం ప్రారంభించాలని అనుకున్నా. క్రికెట్ కు అందించిన అవకాశాలకు అపారమైన కృతజ్ఞత భావంతో ఉండాలని సూచిస్తున్నా. కలలకు హద్దులు లేవు. ఎలాంటి కష్టాలు వచ్చిన పోరాడాలి. ప్రయత్నించాలి. అంటూ పోస్ట్ చేశారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×