E-Paper
Advertisement

Horoscope 7 october 2024: ఈ రాశి వారికి ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు! దుర్గాస్తుతి పఠిస్తే మెరుగైన ఫలితాలు!

Horoscope 7 october 2024: ఈ రాశి వారికి ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు! దుర్గాస్తుతి పఠిస్తే మెరుగైన ఫలితాలు!

Astrology 7 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి విజయావకాశాలు వరించనున్నాయి? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. పంచముఖ ఆంజనేయ స్తోత్ర పారాయణం మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పెద్దల సలహాలతో పూర్తి చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రశంసలు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీ మీ రంగాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడిన తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన ఆలోచనలతో సత్పలితాలు. వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చుల విషయంలో దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబ కలహాలు ఉండవచ్చు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి డబ్బు చేతిక అందక ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణ చేయాలి.

Also Read: శని ఆట మొదలు.. ఈ 3 రాశుల వారి కష్టాలన్నీ తొలగిపోనున్నాయిః

తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. అవసరానికి డబ్బు అందక ఇబ్బందులు పడతారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. దుర్గాస్తుతి పఠిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. శ్రీమహాలక్ష్మి దేవి ఆరాధన శుభకరం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల సహకారంతో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో ఫూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అవసరానికి చేతిక డబ్బు అందక ఇబ్బందులు వస్తాయి. గణపతి అష్టోత్తరం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించిన ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై దృష్టి సారించాలి. సమాజంలో గౌరవంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం:
మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచించవద్దు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాల్లో విపరీతమైన పోటీ ఉంటుంది. హనుమాన్ ఆలయ సందర్శనతో సమస్యలు తొలగిపోతాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×