BigTV English

OTT Movie : పిచ్చెక్కించే కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్… ఆ హాస్పిటల్ గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

OTT Movie : పిచ్చెక్కించే కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్… ఆ హాస్పిటల్ గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

OTT Movie : గతంలో సీరియల్స్ టైం స్టార్ట్ అయింది అంటే చాలు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చునే వారు చాలామంది మహిళలు. కానీ ఇప్పుడు తరం మారింది కదా..  అప్పట్లో సీరియల్స్ కి ఎలా అలవాటు పడ్డారో ఇప్పుడు ఓటిటిలో ప్రసారమయ్యే సినిమాలను, సిరీస్ లను చూడడానికి కూడా అలాగే ఎగబడుతున్నారు. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అరచేతిలోనే ప్రపంచమంతా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇక అందులోనూ పలు ఓటిటిలకు సబ్స్రిప్షన్ ఉంటే కావాల్సినంత టైంపాస్ దొరుకుతుంది. కానీ అందులోనూ కొన్ని సినిమాలు ఫ్యూజులు అవుట్ అయ్యే స్టోరీతో ఉంటాయి. వాటికోసం తెగ వెతికేస్తుంటారు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. అంతేకాకుండా ఇదొక కొరియన్ డ్రామా. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? సిరీస్ పేరేంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పీరియాడికల్, సైంటిఫిక్ యాక్షన్ కొరియన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. పైగా ఒక్కో ఎపిసోడ్ 70 నిమిషాలకు పైగా ఉంటుంది. కానీ ఈ సిరీస్ ను చూడడం మొదలు పెడితే ఆపడం కష్టం అనిపిస్తుంది. ఇక ఆసక్తిని కలిగించే విషయం ఏమిటంటే ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది అని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాకుండా ఐఎమ్డిబి లో దీనికి 7.8/10 రేటింగ్ ఉంది.


కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ 1945లో జపాన్ కొరియాను పాలిస్తున్న రోజుల్లో జరిగిన వాస్తవ సంఘటన అని తెలుస్తోంది. ఇక స్టోరీలోకి వెళ్తే.. సినిమాలో గ్యాంగ్సన్ అనే ఒక ఊర్లో, ఓ వింత హాస్పిటల్ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా హాస్పిటల్ అనేది కామన్ కదా. ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్ కి వెళ్లాల్సిందే కదా అని అనుకుంటున్నారా? కానీ ఈ వింత హాస్పిటల్ సెపరేట్. ఎందుకంటే ఒక్కసారి రోగం పేరుతో ఈ హాస్పిటల్ లోపలికి వెళ్లారంటే ప్రాణాలతో తిరిగి రావడం కలలో కూడా జరగదు. కనీసం శవం కూడా దొరకదు. వాళ్లు ఏమయ్యారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఇంతటి భయంకరమైన ఈ హాస్పిటల్ లోకి ఒకానొక సందర్భంలో హీరో హీరోయిన్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఫ్యూజులు అవుట్ అయ్యే రేంజ్ లో ఓ సీక్రెట్ తెలిసిపోతుంది. దీంతో హీరో హీరోయిన్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి బయటపడడానికి పరుగులు పెడతారు. మరి హీరో హీరోయిన్ కి తెలిసిన ఆ సీక్రెట్ ఏంటి? ఆ హాస్పిటల్లో ఏం జరుగుతోంది? లోపలికి వెళ్ళిన రోగులు ఎందుకు బయటకు రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘జియోంగ్ సీయోంగ్ క్రీచర్’ అనే ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి తీరాల్సిందే. సిరీస్ మొత్తం ఇంట్రెస్టింగా సాగడమే కాదు అక్కడక్కడ హారర్ సీన్స్ తో భయపడుతుంది కూడా.

Tags

Related News

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×