Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్ 20 నుంచి ఏఫ్రిల్ 26 వరకు ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో నూతన పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహ నిర్మాణానికి అవరోధాలు తొలగుతాయి. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులు చదువు పై దృష్టి పెడతారు. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వృషభం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు లాభం కలిగిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా బాధిస్తున్న సమస్యల నుండి బయట పడతారు. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.
మిథునం: నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఇంట్లో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వారం చివరన స్వల్ప వివాదాలు ఉంటాయి.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి.
సింహం: ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు కలుగుతాయి.
కన్య: వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుండి అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ఓర్పుతో కుటుంబ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
ALSO READ: జన్మజన్మల్లోవెంటాడేకర్మలుఅవేనట – మీరు ఏ కర్మలుచేశారోతెలుసా..?
తుల: అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు మరింత కష్టపడితేగానీ మంచి ఫలితాలు పొందలేరు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత పెరుగుతాయి.
వృశ్చికం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలలో ఒప్పందాలు చేసుకుంటారు.
ధనుస్సు: ముఖ్యమైన పనులలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలిసివస్తాయి. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.
మకరం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలుకు అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.
కుంభం: ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
మీనం: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. నూతన పరిచయాలు కలుగుతాయి. ఇంట్లో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనిభారం కొంతవరకు తగ్గుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత సహాయ సహకారాలు అందుతాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు