BigTV Kissik Talks Show : బుల్లితెర సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని పరిచయం అక్కర్లేని జంట. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను, ప్రశంసలు అందుకుంటున్న సీరియల్ కపుల్. రియల్ లైఫ్ లో వారి ప్రేమ కథ అందరికీ తెలిసిందే. అమర్ జానకి కలగన లేదు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో బుల్లితెర రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించి.. సీరియల్స్ లో నటిస్తూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ లో నటించే పాత్రల ద్వారా కాక నిజజీవితంలో వారి ప్రేమ కథ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా తేజస్విని స్పందించారు. జబర్దస్త్ వర్ష హోస్ట్ వ్యవహరిస్తున్న, బిగ్ టీవీ కిసిక్క్ టాక్ షోలో తేజస్విని ముచ్చటించారు.
వర్ష : బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ సీరియస్ చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు సీరియస్ చేయట్లేదు.
తేజు : బిఫోర్ మ్యారేజ్ నేను ఎక్కువ షూట్లో ఉండేదాన్ని. వరుసగా తమిళ, తెలుగు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండే దాన్ని, రెండు పెద్ద ప్రాజెక్టుతో ఒక రియాల్టీ షో కూడా చేశాను. హాఫ్ డే చెన్నైలో హాఫ్ డే హైదరాబాదులో అలా చేశాను. అంత బిజీ పెళ్లి అయ్యాక కుదరదు అని అనుకున్నా, ఎప్పుడైతే పెళ్లి ఫిక్స్ అయిందో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఒక సీరియల్ చేతిలో పెట్టుకుని, రియాల్టీ షోస్ కి వెళ్ళాలి అనుకున్నాను. సీరియల్స్ కి అయితే గ్యాప్ వచ్చింది కానీ, టీవి ప్రోగ్రామ్స్ లతో అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉన్నాను. అని పెళ్లి అయ్యాక టైం కుదరక సీరియల్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలిపారు.
వర్ష : అమర్ సుమ అక్క తో ఒక వంట చేసే ప్రోగ్రాం చేస్తున్నాడు నిజంగా ఇంట్లో వంట చేస్తాడా?
తేజు : అస్సలు వంటింటి వైపే రాడు, కుకింగ్ లో షోలో అయితే ఏదో అలా ఇలా కలిపేసి చేసేస్తున్నాను అని ఇంటికి వచ్చి చెప్తాడు. ఇక రెస్పాన్సిబిలిటీ అమర్ కంటే ఎక్కువ నేనే తీసుకుంటాను. అమర్ ని కంట్రోల్ చేయడం అన్నది కాదు కానీ ఇంట్లో బాధ్యతలు నేను తీసుకుంటాను. నేను చెప్పేది తను వింటాడు గొడవపడితే వినడు కానీ కూల్ గా చెప్తే వింటాడు. కూర్చొని అలా కాదు ఇలా అని నిదానంగా చెప్తే చెప్పిన మాట వింటాడు. తను వినకపోతే నేను సైలెంట్ అయిపోతాను కొంతసేపటికి తనే దారిలోకి వస్తాడు. మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాము.
వర్ష :ఇంట్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు?
తేజు : తను ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తాడు షాపింగ్ ఎక్కువ చేస్తాడు గ్రాజెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తాడు. చాలా యూనిక్ గా కలెక్ట్ చేస్తాడు. పవర్ బ్యాంక్స్ చాలానే కొన్నాడు ఇప్పటికి ఒకదానికొకటి సంబంధం ఉండదు డిజైన్స్ అని వేరువేరుగా ఉంటాయి. ఎవరో యూకే నుంచి వస్తుంటే ఒక చిన్న కంప్యూటర్ లాంటిది ఒకటి తెప్పించాడు. ఏంట్రా అది అంటే అది అలారం అని అన్నాడు. యు కెన్ నుంచి అలారం తెప్పించాడా అని అంటే ఇవన్నీ పెట్టి నువ్వు ఒక వీడియో చేసుకోవే అని అంటాడు. నీ వీడియోస్ కోసమే వాడు షాపింగ్ చేస్తున్నట్టున్నాడు అని వర్ష అంటుంది. డబ్బులు ఉంటే ఎక్కువ ఖర్చు చేస్తాడు లేదంటే తక్కువ చేస్తాడు. నేనైతే ఒకేసారి ఒక 50,000 పెట్టి కొనేస్తాను. లేదంటే అసలు కొనను. చాలా ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఆలోచిస్తాను. డబ్బులు ఎక్కువ సేవ్ చేయడానికి ఆలోచిస్తాను కానీ ఖర్చుని తగ్గించుకొని, ఏదైనా ల్యాండ్ కొనడం మీద ఆలోచిస్తాను.
వర్ష :తేజు తొందరలో బుల్లి అమర్ మా ముందుకి వస్తున్నాడా?
తేజు : లేదు ప్రస్తుతానికైతే, ఎక్కువ డిలే అయితే చేయము గాని, అమర్ కి అమ్మాయి కావాలి, నాకు ముందు నుంచి అమ్మాయి కావాలి. బాబు పుడితే మాత్రం నేను చూసుకోను అని చెప్పేసాడు. అందుకే అమ్మాయి కావాలని దేవుడికి దండం పెట్టుకుంటా మా ఇంట్లో వాళ్ళు అలానే అనుకుంటున్నారు.
తేజు ఈ టాక్ షో లో తన లైఫ్ లో జరిగిన విషయాలను పంచుకున్నారు.