Coconut Water For Face: అమ్మాయిలు అందమైన, మెరిసే, స్పష్టమైన చర్మం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌తో పాటు వివిధ రకాల హోం రెమెడీస్ కూడా వాడుతుంటారు. కానీ వీటన్నింటికి బదులుగా కొబ్బరి నీళ్లు మీ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.ఇవి తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రతిరోజూ మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు అప్లై చేస్తుంటే మాత్రం.. మీ చర్మం ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుతుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్లు ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సహజ మెరుపు:
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం నుండి నీరసాన్ని తొలగించి సహజమైన మెరుపును ఇస్తాయి. అంతే కాకుండా తరచుగా కొబ్బరి నీళ్లతో ముఖానికి అప్లై చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
మొటిమలు తగ్గుతాయి:
మీ చర్మం జిడ్డుగా ఉండి.. తరచుగా మొటిమలు వస్తుంటే మాత్రం కొబ్బరి నీళ్లు మీకు ఒక వరం లాంటివి. ఇవి యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా మొటిమలను త్వరగా తగ్గించి, కొత్త మొటిమలు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
టానింగ్ , మచ్చలను తగ్గుతాయి:
తీవ్రమైన సూర్యకాంతికి గురికావడం వల్ల ముఖంపై ట్యానింగ్, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కొబ్బరి నీళ్లలో చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి. ఇవి ముఖం నుండి ట్యాన్ తొలగించడంలో అంతే కాకుండా మచ్చలను నివారించడంలో సహాయపడతాయి.
పొడి చర్మం:
మీ చర్మం పొడిగా, నిర్జీవంగా అనిపిస్తే.. కొబ్బరి నీళ్లు దానిని హైడ్రేటెడ్ గా మారుస్తాయి. అంతే కాకుండా మృదువుగా చేస్తాయి. ఇందులో ఉండే సహజ ఖనిజాలు చర్మాన్ని లోతుగా తేమగా చేసి పొడిబారకుండా కాపాడుతాయి.
ముఖ రంధ్రాలు:
తెరిచి ఉన్న రంధ్రాలలో దుమ్ము, ధూళి త్వరగా పేరుకుపోయి ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతే కాకుండా కొబ్బరి నీరు సహజ టోనర్‌గా పనిచేస్తుంది. ఇది తెరుచుకున్న ముఖ రంధ్రాలను బిగించి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
ముడతలు:
కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖంపై గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.
చర్మానికి చల్లదనం, ఉపశమనం:
వేసవిలో చర్మాన్ని చల్లగా , తాజాగా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక అద్భుతమైన పరిష్కారం. వీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు, ఎరుపు, వడదెబ్బ వంటి సమస్యలు తగ్గుతాయి.
Also Read: ఓ మై గాడ్.. 30 రోజులు టీ తాగకపోతే.. ఇన్ని లాభాలా ?
ఎలా ఉపయోగించాలి ?
కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి, ముఖం అంతా సున్నితంగా అప్లై చేయండి.
10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
మంచి ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి ఉపయోగించండి.