BigTV English

Horoscope Today April 30th : ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు

Horoscope Today April 30th : ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 30న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

వృషభం: ఉద్యోగస్తులకు  అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.


మిధునం: వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నూతన సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కర్కాటకం: మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. ఇంట్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

సింహం: వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

వృశ్చికం: ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

ధనస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి.

మకరం: వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

కుంభం: కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

మీనం: అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×