Samantha: సినీ నటి సమంత(Samantha) ఇటీవల కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇటీవల తెలుగు సినిమాలకు సమంత కాస్త దూరంగా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ లపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈమె రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఈమె తన నిర్మాణ సంస్థలోనే మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇలా ఈ సినిమాని ప్రకటించిన తర్వాత సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం వెల్లడించలేదు. అయితే గతంలో ఈ సినిమా జూన్ నుంచి షూటింగ్ పనులను జరుపుకుంటుందని సమంత వెల్లడించారు. అయితే ఇప్పటివరకు షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాలేదు.తాజాగా సమంత ఈ సినిమా షూటింగ్ గురించి బిగ్ అప్డేట్ తెలియచేశారు. సమంత తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది మీ నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఏంటి అంటూ ప్రశ్న వేయడంతో సమంత తన తదుపరి సినిమా గురించి తెలియజేశారు.
ఈమె తన నిర్మాణ సంస్థలో ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ఇలా సమంత మరో తెలుగు సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత చివరిగా ఖుషీ సినిమా(Khushi Movie) ద్వార వెండితెరపై ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సినిమా తర్వాత పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటించకపోయిన ఈమె నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమాలో మాత్రం ఒక చిన్న పాత్రలో కనిపించి సందడి చేశారు.
నందిని రెడ్డి డైరెక్షన్ లో…
ఇక మా ఇంటి బంగారం సినిమా విషయాని వస్తే ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ లేడి డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరూ చాలా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్లో ఇదివరకు ఓ బేబీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మా ఇంటి బంగారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమంత చెప్పడంతో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని స్పష్టమవుతుంది. మరి ఈ సినిమాలో తదుపరి నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!