Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మ కారులో వెళ్లిపోయాక అనామిక లోపలికి వెళ్తుంటే గుప్త వస్తాడు. గుప్తను చూసిన అనామిక సంతోషంగా దగ్గరకు వెళ్లి గుప్తగారు చూశారా..? మా ఆయనను భాగీని ఎలా కలిపేశానో… ఆయన ఫోన్ చేసి మరీ భాగీని బయటకు రమ్మని చెప్పారు. ఆయన అలా అనుకున్నారు అంటే అంతా మన వల్లే మీరు కావాలంటే నన్ను పొగడొచ్చు. అని అనామిక అనగానే గుప్త నవ్వుతూ వెళ్లిపోతుంటాడు. దీంతో అనామిక గుప్త గారు మాట్లడుతుంటే అలా వెళ్లిపోతున్నారు ఏంటి..? అని అడుగుతుంది. దీంతో గుప్త సంతోషంగా ఉన్నావు కదా బాలిక. అది చెడగొట్టడం ఇష్టం లేక వెళ్లిపోతున్నాను అంటాడు. దీంతో అనుమానంగా అనామిక మీరు మాట్లాడితే నా సంతోషం ఎందుకు దూరం అవుతుంది. అని అడగ్గా.. నువ్వు నమ్ముతున్నది.. జరుగుతున్నది ఒక్కటి కాదు కాబట్టి నిజం ఏమిటో మాకు తెలియును కనుక అంటాడు. అయితే నేను చూస్తున్నది నిజం కానప్పుడు మరి నిజం ఏంటో చెప్పండి అని అనామిక అడుగుతుంది.
దీంతో నీ పతి దేవుడు ఒంటరిగా బయటకు రమ్మన్నప్పుడు కూడా నీకు అతని మాటల్లోని అంతరార్థం అవగతం కాలేదా..? అని చెప్పగానే అనామిక భయంగా ఏంటి గుప్తగారు ఆయన భాగీని బయటకు రమ్మని చెప్పింది సరదాగా తిరగడానికి కాదా..? అని అడుగుతుంది. దీంతో కాదు బాలిక నీ ప్రాణములు తీసిన వాడిని పట్టుకునేందుకు అని గుప్త చెప్తాడు. దీంతో అనామిక అసలేం జరగుతుంది గుప్త గారు.. అంటే ఇప్పుడు భాగీ సంతోషంగా ప్రమాదం వైపు వెళ్తుందా…? లేదు గుప్త గారు ఆయన అక్కడ అనుకున్నది జరగకపోతే భాగీ ప్రాణాలకే ప్రమాదం. నా చెల్లి ప్రాణాల మీదకు వచ్చే ఏ ప్లాన్ నాకు అవసరం లేదు. ఇప్పుడే వెళ్లి నా భాగీని నేను కాపాడుకుంటాను అని అనామిక వెళ్లబోతుంటే.. గుప్త ఆగుము బాలిక నువ్వు వెళ్లుటకు వీలు లేదు. జరుగునది వీక్షించుట తప్పా మార్చుటకు వీలులేదు. కాదని విధికి ఎదురు వెళ్లినచో ఆ ప్రమాదం నీ కుటుంబానికి వచ్చునని తెలుయును కదా అంటాడు. కాదని నువ్వు వెళ్లదలుచుకున్నచో వెళ్లుము.. తర్వాత వచ్చే ప్రమాదాలకు నువ్వే బాధపడతావు అని గుప్త వెళ్లిపోతాడు.
మరోవైపు ఒక దగ్గర పోలీసులతో అమర్, రాథోడ్ వెయిట్ చేస్తుంటారు. రాథోడ్ అమర్ దగ్గరకు వెళ్లి సార్ నాకు ఎందుకో భయంగా ఉంది. కనీసం మేడంకు దూరంగానైనా మీరు ఫాలో అవ్వండి సార్ అని చెప్తాడు. దీంతో అమర్ నన్ను చూస్తే బాబ్జీ.. భాగీ దగ్గరకు కూడా రాడు రాథోడ్. భాగీకి ఏమీ కాదు. ఇవాళ్టీతో వాడి ఆటలు అంతం చేయాలి అని చెప్తాడు. మరోవైపు బాబ్జీకి లిప్ట్ ఇస్తుంది చిత్ర. మధ్యలో దిగిన బాబ్జీని దగ్గరలో ఏమైనా టూరిస్టు ప్లేస్ ఉన్నాయా అని అడుగుతుంది. ఏం లేవని చెప్పి వెళ్లిపోతాడు. చిత్ర కొద్ది దూరం వెళ్లాక మధ్యలో అమర్ వాళ్లు ఉన్న దగ్గరకు వెళ్తుంది. అక్కడ పోలీసులు చెక్ చేస్తుంటారు. చిత్ర కారు దిగి పోలీసులతో మాట్లాడుతుంది. రాథోడ్ చిత్రను చూస్తాడు. సార్ చిత్ర ఉంది అక్కడ అని చెప్పగానే అమర్ కూడా చూస్తాడు. తను ఇక్కడేం చేస్తుంది అంటూ ఇద్దరూ కలిసి దగ్గరకు వెళ్తారు.
అమర్ ను చూసిన చిత్ర షాక్ అవుతుంది. అమర్ చిత్రను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అసలు కొడైకెనాల్ లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. చిత్ర రెండు రోజులు అయింది సార్ వచ్చి ఊరికే ఊరు చూద్దామని వచ్చాను అని చెప్తుంది. పోలీస్ ఈ అమ్మాయి మీకు తెలుసా..? సార్ అని అడుగుతాడు. తెలుసు తను నా వైఫ్, మనోహరి ఒకే ఆశ్రమంలో పెరిగారు అని చెప్తాడు. మాట్లాడిన తర్వాత మనోహరిని కలిసిన తర్వాత భోజనానికి ఇంటికి రా అని పిలుస్తాడు. తప్పకుండా వస్తాను సార్ అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో మిస్సమ్మ కారును ఫాలో అవుతున్న పోలీస్ అమర్‌కు ఫోన్ చేసి మేడం కారును ఏదో లారీ ఫాలో చేస్తుందని చెప్తాడు. దీంతో అమర్ , పోలీసులను తీసుకుని కారు ఎదురుగా వెళ్తుంటారు. బాబ్జీ మాత్రం ఇంకొద్ది సేపట్లో మిస్సమ్మను చంపబోతున్నాను అని సంతోషిస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?