Siva Jyothi: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి(Siva Jyothi) ఇటీవల తనకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.. ఈమె గంగూలీ (Ganguly) అనే వ్యక్తిని ప్రేమించి 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీ(Pregnancy) విషయాలతో పాటు తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇలా విజయదశమి పండుగ రోజు తన ప్రెగ్నెన్సీ గురించి అధికారకంగా తెలియజేసిన శివ జ్యోతి తాజాగా తన సీమంతపు వేడుకలకు(Baby Shower Ceremony) సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
ప్రస్తుతం ఈమెకు ఐదవ నెల అని తెలుస్తుంది. ఇలా ఐదో నెలలో భాగంగా సీమంతం జరిగినట్టు తెలియజేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. రెండు హృదయాలు మరొక గుండెచప్పుడు కోసం ఎదురు చూస్తున్నాయి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు అభినందనలు తెలియజేయడమే కాకుండా పలు జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు.
ఇక శివ జ్యోతి విషయానికి వస్తే.. తీన్మార్ వార్తల ద్వారా సావిత్రిగా ఎంతో ఫేమస్ అయిన ఈమె అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న శివ జ్యోతి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సినిమా ప్రమోషన్లలో కూడా సందడి చేశారు. అనంతరం బిగ్ బాస్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా నిత్యం అభిమానులను సందడి చేస్తున్న శివ జ్యోతి ప్రెగ్నెన్సీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికి ఈమె మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని అందరికీ శుభవార్తను తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలని, ఎవరు నా బిడ్డకు దిష్టి పెట్టకుండా కేవలం ఆశీర్వాదాలు మాత్రమే అందించండి అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇకపోతే శివ జ్యోతి ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా సొమ్ము చేసుకున్నారు అంటూ ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ చేసిన ఆరోపణలపై శివజ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Vijay Devarakonda: నిశ్చితార్థం తరువాత ఫేవరెట్ ప్లేస్ కి విజయ్ దేవరకొండ.. ప్రత్యేకం ఏంటబ్బా!