Arbaaz Khan-Sshura Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట మరో కొత్త మెంబర్ వచ్చి చేరారు. ఆయన సోదరుడు, నటుడు ఆర్భాజ్ ఖాన్ మరోసారి తండ్రయ్యాడు. 58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య షురా ఖాన్ ఆదివారం (అక్టోబర్ 5) పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ, ఆర్భాజ్ ఖాన్ మరోసారి తండ్రయ్యాడు బాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ శుభవార్త తెలుసుకున్న సల్మాన్ ఫామ్ హౌజ్ నుంచి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడట. కాగా చాలా రోజుల తర్వాత వారి ఇంట ఆడిపిల్ల పుట్టడంతో సల్మాన్ ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుస్తోంది. కాగా ఆర్బాజ్ ఖాన్‌కి షురా రెండో భార్య అనే విషయం తెలిసిందే. గతంలో ఆర్భాజ్ ఖాన్ మలైకా ఆరోరాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్హాన్ ఖాన్ జన్మించాడు. ప్రస్తుతం ఆర్హాన్ ఖాన్‌కి 22 ఏళ్లు. 1998లో పెళ్లి చేసుకున్న ఆర్భాజ్, మలైకాలో 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా జీవించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకుని విడిపోయారు.
Also Read: Baahubali Movie: షాకింగ్ న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!
డైవోర్స్ అనంతరం ఆర్భాజ్ మెకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను 2013లో పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత షురా ఈ ఏడాది ప్రారంభంలో గర్భం దాల్చినట్టు ప్రకటించగా. తాజాగా ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. కాగా సల్మాన్ సోదరుడిగా ఆర్భాజ్ ఖాన్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. హిందీతో పాటు తెలుగులోనూ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు పొందాడు. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు హిందీ చిత్రాల్లో హీరోగా, విలన్గా నటించాడు. అలాగే తెలుగులో జై చిరంజీవి చిత్రంలో ప్రతికథానాయకుడిగా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే వంటి సినిమాల్లో విలన్ రోల్స్ కనిపించి ఆకట్టకున్నాడు.