IND VS PAK Women: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా పోరాడుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆగిపోయింది. కొన్ని లైట్ పురుగులు ఆటకు అంతరాయాన్ని కలిగించిన నేపథ్యంలో మ్యాచ్ కాసేపు ఆపేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వందకు పైగా టీమిండియా స్కోర్ చేసిన తర్వాత కొన్ని పురుగులు గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి లైట్ పురుగులు అని చెబుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా టీమిండియా బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాయి ఆ పురుగులు. అటు ఫీల్డర్స్ కూడా వాటి వల్ల విసిగిపోయారు. దీంతో కొన్ని స్ప్రేలు తీసుకువచ్చి గ్రౌండ్ లో స్ప్రే చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ సనా కూడా ఆ పురుగులపై స్ప్రే చేస్తూ కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయినప్పటికీ పురుగుల తాకిడి… ఏ మాత్రం తగ్గలేదు. మరింత పెరగడంతో మ్యాచ్ అర్ధాంతరంగా ఆపేశారు అంపైర్లు. అనంతరం స్టేడియం నుంచి ఆ పురుగులను వెళ్లగొట్టేందుకు స్ప్రే కొట్టే వాళ్లను రంగంలోకి దింపారు. దీంతో ముఖానికి మాస్క్ వేసుకొని, ఫ్యూమిగేషన్ చేసింది గ్రౌండ్ సిబ్బంది. అనంతరం మ్యాచ్ పునః ప్రారంభించారు.
పీకలోతు కష్టాల్లో పడ్డ టీమిండియా
పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది మహిళల టీమిండియా. ఈ మ్యాచ్ లో ఇప్పటికే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా పోరాడుతోంది. 39 ఓవర్లు ఆడిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసింది. హర్లీన్ డియోల్ ఒక్కరే 46 పరుగులు చేయగా జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ మినహా మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయింది టీమిండియా.
ప్రస్తుతం దీప్తి శర్మ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా స్నేహ రాణా నాలుగు పరుగులతో గ్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు పాకిస్తాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి ఊపులో ఉండగా…. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓటేమి చవిచూసింది. ఇప్పటివరకు వన్డేలో టీం ఇండియా పై ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేదన్న సంగతి తెలిసిందే.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
Players and umpires have left the field due to insects causing a disturbance. 🏟️🙆♂️
A staff member brings out bug fumigation equipment to deal with the situation. #INDWvPAKW #Colombo #CWC25 #Sportskeeda pic.twitter.com/icJLGaktoO
— Sportskeeda (@Sportskeeda) October 5, 2025