BigTV English

Horoscope Today April 5th : ఆ రాశి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభాలు – ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది  

Horoscope Today April 5th : ఆ రాశి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభాలు – ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది  

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 5న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు, మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు  స్థానచలనాలు తప్పవు.

వృషభం: చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.


మిధునం: కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం: బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగంలో  అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

కన్య: నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఉద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు, మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.

వృశ్చికం: అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం: విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

కుంభం: సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం: కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Big Stories

×