OG Movie: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఓజీ(OG). గత మూడు సంవత్సరాలుగా అభిమానులు ఈ తరుణం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు.. ఇక ఈ సినిమా నేను ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో సినిమా చూడటం కోసం థియేటర్లకు క్యూ కట్టారు. ఇక మొదటి రోజు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలి రావడంతో పలు ప్రాంతాలలో ప్రమాదకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా పలు ప్రాంతాలలో షోలను నిలిపివేశారు.
ఇక మరికొన్ని ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున గొడవలకు దిగడంతో షోలను రద్దు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా షోలో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమాదానికి గురి కావడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో థియేటర్ యాజమాన్యం కెపాసిటీకి మించి టికెట్లను జారీ చేసిన నేపథ్యంలో పలుచోట్ల ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి ఏషియన్ థియేటర్లో (bhadradri asian theatre) విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
స్పీకర్లు పడటంతో ప్రమాదం..
ఈ థియేటర్లో కెపాసిటీకి మించి సుమారు 1200 మందికి అనుమతి తెలపడంతో థియేటర్ లోపల అభిమానులు ఒక్కరి బిక్కిరి అయ్యారు. ఈ క్రమంలోనే థియేటర్లలో స్పీకర్లు మీద పడి ఇద్దరు అభిమానులు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇలా స్పీకర్లు ఒక్కసారిగా మీద పడటంతో ఆ ఇద్దరి అభిమానుల తలలపై బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగిన నేపథ్యంలో వెంటనే వారిని సరైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదం జరగడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెపాసిటీ మించి ప్రేక్షకులను లోపలికి పంపించడంతో ప్రేక్షకులు ఎంతో ఇబ్బందులకు గురి అయ్యారని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.
OG సినిమా షోలో విషాదం
స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్లో ఘటన
కెపాసిటీకి మించి 1200 మందిని థియేటర్లోకి అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానుల ఆగ్రహం pic.twitter.com/oDBxZDvMBJ
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025
ఓజీ సినిమా విడుదల సందర్భంగా కేవలం భద్రాద్రి గూడెం జిల్లాలో మాత్రమే కాదు పలు ప్రాంతాలలో ఈ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఈ ఘటనపై స్పందిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. ఫుల్ మీల్స్ అనుకున్న అభిమానులకు ప్లేట్ మీల్స్ తో డైరెక్టర్ సుజీత్ సరిపెట్టారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో మొదటి రోజు 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబడతాయని అంచనా వేస్తున్నారు.