Ayyanna vs Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు స్పీకర్ అయ్యన్నపాత్రడు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల నేతలు హుందాగా వ్యవహరించాలన్నారు. అంతేకానీ రప్పా రప్పా ఏంటని సూటిగా ప్రశ్నించారు ఆయన. ఇలాంటి పోకడ మంచిది కాదని చెప్పకనే చెప్పారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం ఉదయం సభా సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై టీడీపీ సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మరో సభ్యుడు మాట్లాడే ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోరు విప్పారు. ఉన్నతమైన కుర్చీలో కూర్చొన్నప్పటికీ అనేక విషయాలు చూస్తుంటే తనకు ఆవేదన కలుగుతోందన్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను సభా దృష్టికి తెచ్చారు.
ప్రతీ రోజూ టీవీలు, సోషల్‌మీడియా, వైసీపీ ప్రెస్‌మీట్‌లో నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దారుణంగా ఉందన్నారు. మళ్లీ మేమే వస్తాం.. పీకలు కోసేస్తాం.. అంతు చూస్తా.. రప్పా.. రప్పా అంటూ సినిమా డైలాగులా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మీద గౌరవమున్న రాజకీయ పార్టీల నేతలు ఈ విధంగా మాట్లాడరని అన్నారు.
ఎన్టీఆర్ హయాం నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని అన్నారు స్పీకర్. రాజకీయాలు అన్నాక ఓటములు, గెలుపులు సహజమన్నారు. ఎన్టీఆర్ కూడా ఒకానొక సమయంలో ఓడిపోయారని వివరించారు. మహా నాయకురాలు ఇందిరాగాంధీ ఓడిపోయిన విషయాన్ని వివరించారు. ఓడిపోతే ‘రప్పా.. రప్పా’ ఇదేంటి? ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు సైతం ఖండించాలని సభా వేదికగా చెప్పుకొచ్చారు.
ALSO READ: మండలిలో పీఆర్సీపై రచ్చ
తాను మీకు మాదిరిగా విమర్శలు చేయలేనని, ఇలాంటి వ్యాఖ్యల విషయంలో తనకు ఆవేశం వస్తుందన్నారు స్పీకర్. కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు-ఓటములు సహజమన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నాయకులంతా ముందుకు వెళ్లాలన్నారు. ఇష్టానుసారం మాట్లాడడం మంచిదికాదన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పనులు చేయలేదన్నారు అయ్యన్నపాత్రుడు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అమలు కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. అది రాజకీయ నాయకుడి లక్షణమన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఎక్కడైనా అన్యాయం చేస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సీఎం మొదలు మంత్రుల వరకు అందరూ ఉంటారన్నారు.
రోజుకు రెండు ప్రశ్నలు పంపిస్తారని, సభకు రానప్పుడు ప్రశ్నలు దేనికని సూటిగా ప్రశ్నించారు స్పీకర్. ఆనాటి గౌతు లచ్చన్న గురించి కీలక విషయాలు బయటపెట్టారు. ఆయన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ దేవాలయం అయితే తాను కేవలం పూజారి మాత్రమేనని అన్నారు. వరాలు ఇవ్వాల్సింది దేవుడన్నారు. ప్రజలు కేవలం 11 సీట్లతో సరిపెట్టారని గుర్తు చేశారు.
ఎన్నికల్లో ఓడిపోతే రప్పా రప్పా అని మాట్లాడాలా : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ఎవరూ అలా మాట్లాడరు
రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం
ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి మహా నాయకులే ఓడిపోయారు
– స్పీకర్ అయ్యన్నపాత్రుడు pic.twitter.com/EriqV1GgZE
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2025