Manchu Laxmi: మంచు వారసురాలు మంచు లక్ష్మీ అనుకున్నది సాధించింది. తనను తక్కువ చేసి మాట్లాడినవారిపై ఫిర్యాదు చేసి మరీ వారిచేత క్షమాపణలు చెప్పించుకుంది. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యే లక్ష్మీ నటించిన దక్ష సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లక్ష్మీ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక అలానే ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.. సదురు జర్నలిస్ట్.. మంచు లక్ష్మీని కించపరిచేలా మాట్లాడాడు.
మీ వయస్సు 50 దాటింది. మీరొక బిడ్డకు తల్లి. అలాంటి మీరు చిన్న చిన్న బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. అవి పెట్టేముందు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అనేది మీరు ఆలోచిస్తారా.. ? బ్యాడ్ కామెంట్స్ ను ఎలా తీసుకుంటారు.. ? అని అడిగాడు. దానికి మంచు లక్ష్మీ ఫైర్ అయ్యింది. ఇదే మాట ఒక స్టార్ హీరోను అడగగలరా.. ? మహేష్ బాబును మీకు 50 ఏళ్లు వచ్చాయి.. షర్ట్ లేకుండా మీరు ఫోటో ఎలా పెడతారు అని అడగగలరా.. ? అని మండిపడింది.
అంతేకాకుండా మీడియా వలనే చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వారేం నేర్పిస్తున్నారో అవే ప్రశ్నలు ప్రజలు కూడా నేర్చుకుంటున్నారు. నాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. దానిని నేను నాకు నచ్చిన దాంట్లో పొందుతాను. ఇది ఒక అమ్మాయిని అడిగే ప్రశ్న కాదు అని ఫైర్ అయ్యింది. ఇక మంచు లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూతో లక్ష్మీ ఈ విషయాన్నీ వదిలేస్తుంది అనుకున్నారు. కానీ, ఆమె వదలలేదు. సదురు జర్నలిస్ట్ పై ఆమె ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది.
ఇక ఆ ఫిర్యాదు తరువాత మంచు లక్ష్మీకి సపోర్ట్ గా చాలామంది అమ్మాయిలు నిలబడ్డారు. నటి హేమ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలబడింది. ఫిల్మ్ ఛాంబర్ మంచు లక్ష్మీ ఫిర్యాదును సీరియస్ గా తీసుకోలేదని, మా అసోసియేషన్ కూడా ఈ విషయమై పట్టించుకోలేదని ఆమె మండిపడింది. సొంత అక్కను అవమానించారు అన్న కూడా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు పట్టించుకోవడం లేదని, లక్ష్మీ లాంటివారికే ఇండస్ట్రీలో గౌరవం లేకపోతే మిగతావారి పరిస్థితి ఏంటి అని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా మంచు లక్ష్మీకి సదురు జర్నలిస్ట్ క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. మా అసోషియేషన్ ట్రెజరర్ శివబాలాజీ ఈ విషయమై స్పందించినట్లు సమాచారం. ఆయన చెప్పినదాని ప్రకారం.. బాడీ షేమింగ్ చేసిన జర్నలిస్ట్ చేత మంచు లక్ష్మీకి క్షమాపణలు చెప్పించామని, ఆయనతో డైరెక్ట్ గా మంచు విష్ణు మాట్లాడాడని, ఇండస్ట్రీలో ఆడవారిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలుస్తోంది.
సదురు జర్నలిస్ట్ కేవలం క్షమాపణలు చెప్పడమే కాకుండా.. లెటర్ కూడా మా అసోసియేషన్ కు పంపినట్లు తెలిపారు. ఈ విషయంలో తామెవరి పక్షాన నిలబడడం లేదని, న్యాయం చేయడానికి మాత్రమే చూస్తున్నామని శివ బాలాజీ తెలిపినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా మంచు లక్ష్మీ తాను అనుకున్నది సాధించిందని, ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగకుండా చేసిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.