BigTV English

OG Movie: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పవన్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడా ..?

OG Movie: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని పవన్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడా ..?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది అనికచ్చితంగా చెప్పుకొస్తున్నారు. ఓజీ మొదలైన దగ్గరుంచి ఇప్పటివరకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. రిలీజ్ కు ముందు నుంచి కూడా ఓజీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.


ఓజీ రిలీజ్ కు ముందే తెలంగాణ ప్రభుత్వం బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇస్తూ.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ జీవో పాస్ చేసిన విషయం తెల్సిందే. నైజాంలో పదిరోజుల పాటు ఈ చిత్ర టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150 చొప్పున పెంచ్చుకోవచ్చని చెప్పింది.  ఇక 24వ తేదీ రాత్రి రూ.800 టికెట్ రేట్‌తో స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది. దీంతో మేకర్స్ సైతం టికెట్ రేట్లను పెంచారు.

ఇక అంతా బావుంది అనుకొనే సమయంలో  తెలంగాణ హైకోర్టు ఓ బాంబ్ పేల్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపుని రద్దు చేస్తూ జీవో పాస్ చేసింది. టికెట్ ధరలు పెంచకుండా అంతకుముందు ఎలా ఉన్నాయో ఆ ధరలకే టికెట్స్ ను అమ్మాలని ఉత్తర్వలు జారీ చేసింది. ఇది ఓజీ టీమ్ కి పెద్ద షాక్ ఇచ్చింది.


అయితే హైకోర్టు ఆదేశాలను పవన్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. హైకోర్టు చెప్పినా కూడా వినకుండా ఓజీ టికెట్స్ ను వారు నచ్చిన ధరకే అమ్మారు.కోర్టు ఆదేశాల తర్వాత కూడా పెరిగిన ధరలు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని పలువురు కోర్టును కోరుతున్నారు. దీని వలన పవన్ తీవ్రా పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇక ఇదే కాకుండా ఓజీ A సర్టిఫికెట్ వివాదం కూడా విమర్శలను తెచ్చిపెడుతుంది. మొదట ఓజీ యూ/ఏ అందుకుంది. ఆ తర్వాత దాన్ని ఏ గా మార్చారు. అంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. 18 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కు రాకూడదు అని.. కానీ, దాన్ని ఓజీ మేకర్స్ పట్టించుకోలేదు. అది సీరియస్ గా తీసుకోలేదు. చాలామంది చిన్నపిల్లలు థియేటర్లలో సందడి చేశారు. మరి దాని పరిస్థితి ఏంటి అని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వీటి వలన ఓజీకి ముందు ముందు కొత్త తలనొప్పులు వస్తాయా అనేది చూడాలి.

Related News

Manchu Laxmi: అనుకున్నది సాధించిన మంచు లక్ష్మీ.. క్షమాపణ చెప్పిన జర్నలిస్ట్

OG Movie: ఓజీ షోలో విషాదం…ప్రమాదంలో ఇద్దరు పవన్ ఫ్యాన్స్

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

OG Collections: ఓజీ డిస్ట్రక్షన్… ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 160 కోట్లు

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

Big Stories

×